Site icon NTV Telugu

Tollywood : బాలీవుడ్ ‘విలన్స్’ కు ‘బెస్ట్ ఫ్రెండ్’ గా మారుతున్న టాలీవుడ్.. మ్యాటర్ ఏంటంటే

Bollywood (3)

Bollywood (3)

పాన్ ఇండియా సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి తెలుగు చిత్రపరిశ్రమ ఎదగడంతో మిగిలిన వుడ్స్ ఫోకస్ టాలీవుడ్‌పై పడింది. అక్కడ యాక్టర్లు ఇక్కడ నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే వలసల పర్వం ముఖ్యంగా బీటౌన్ నుండి పెరిగింది. హీరోగానే ఛాన్సులివ్వనక్కర్లే యాంటోగనిస్టుగా సపోర్టింగ్ క్యారెక్టర్ ఇచ్చినా మహా ప్రసాదంలా స్వీకరిస్తున్నారు. ఇక అక్కడ ఫేడవుటైన సీనియర్ హీరోలకు వరంగానూ మారింది టాలీవుడ్. ఇక కెరీర్ ఖతం అనుకుంటున్న టైంలో  బ్రేక్ ఇస్తున్నారు ఇక్కడ మేకర్స్. ఇప్పటికే సల్మాన్, సంజయ్ దత్, బాబీడియోల్, అర్జున్ రామ్ పాల్, వివేక్ ఓబెరాయ్, సైఫ్ అలీఖాన్ టాలీవుడ్‌లో మెరిస్తే.. ఈ జాబితాలోకి చేరారు మరికొందరు.

Also Read : RT 76 : టైటిల్ కూడా ఫిక్స్ కాకుండానే నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్

బాలీవుడ్ రొమాంటిక్ హీరో లిప్ కిసెస్‌కు బ్రాండ్ అంబాసిడరైన ఇమ్రాన్ హష్మీ బీటౌన్‌లో మార్కెట్ కోల్పోతున్నాడు. ఆయన వెనుకొచ్చిన యంగ్ అండ్ డైనమిక్ హీరోలు ఇంటిమేట్ సీన్లలో ఈయనకంటే రెచ్చిపోతుంటే  ఇమ్రాన్‌ను పట్టించుకునేదెవరు. యాక్షన్ వైపు టర్న్ తీసుకున్నా ఎవరు చూడలేదు. అందుకే టాలీవుడ్ నుండి యాంటోగనిస్టుగా ఆఫర్ రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఓజాస్ గంభీరతో ఓమీగా తలపడబోతున్నాడు. సెప్టెంబర్ 25న ఆగమనమౌతున్న ఓజీతో మన టాలీవుడ్‌కు కొత్త విలన్ దొరికేసినట్లే. గూఢచారి2లో అడవి శేష్‌తో ఢీకొట్టబోతున్నాడు హష్మీ. ఇక బాలీవుడ్‌కు బై బై చెప్పి సౌత్ సినిమాలపై ఇంప్రెషన్ పెంచుకున్న స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అడివి శేష్ హీరోగా నటిస్తోన్న డెకాయిట్‌తో ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మీర్జాపూర్ సిరీస్‌తో మున్నాభాయ్‌గా క్రేజ్ సంపాదించుకున్న దివ్యేందు శర్మ కూడా టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఆఫర్ కొల్లగొట్టాడు. పెద్దిలో రామ్ చరణ్‌తో తలపడబోతున్నాడు. నాగ చైతన్య 24లో లాపతా లేడీస్ హీరో స్పర్శ్ శ్రీవాత్సవ్, మహాకాళితో అక్షయ్ ఖన్నా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇలా బాలీవుడ్ హీరోలు, డైరెక్టర్స్ కు టాలీవుడ్ ఒక దారి చూపిస్తోంది.

Exit mobile version