RT 76 : టైటిల్ కూడా ఫిక్స్ కాకుండానే నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు మాస్ మహారాజ. ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో చేస్తున్న ‘మాస్ జాతర’ సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబరు 31న రిలీజ్ కు రెడీ అవుతోంది. మాస్ జాతర సెట్స్ పై ఉండగానే తన నెక్ట్స్ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ ఇప్పడు ఆ సినిమా షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. నేనుశైలజా, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రవితేజ.
Also Read : Kishkindhapuri : బెల్లం పైనే ఉప్మా ఆశలన్నీ.. ఆశ తీరుస్తాడా?
Also Read
రవితేజ కెరీర్ లో 76వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో రవితేజ స్టైల్ కామెడీ, కిషోర్ టేకింగ్ లో ఉండే ఎమోషన్స్ తో కలగలిపి పర్ఫెక్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాగా రాబోతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ అయింది. ప్రముఖ ఓటీటీ నిర్మాణ సంస్థ జీ5 రవితేజ – కిషోర్ తిరుమల సినిమా ఓటీటీ రైట్స్ తో పాటు శాటిలైట్ రైట్స్ ను కూడా కొనుగోలు చేసింది. ఇంకా టైటిల్ కూడా అధికారకంగా ప్రకటించని సినిమా ఓటీటీ రైట్స్ అమ్ముడయ్యాయి అంటే జాక్ పాట్ అనే చెప్పాలి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ నెలాఖరుకు మొత్తం వర్క్ కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!