Tollywood : బాలీవుడ్ ‘విలన్స్’ కు ‘బెస్ట్ ఫ్రెండ్’ గా మారుతున్న టాలీవుడ్.. మ్యాటర్ ఏంటంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి తెలుగు చిత్రపరిశ్రమ ఎదగడంతో మిగిలిన వుడ్స్ ఫోకస్ టాలీవుడ్‌పై పడింది. అక్కడ యాక్టర్లు ఇక్కడ నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే వలసల పర్వం ముఖ్యంగా బీటౌన్ నుండి పెరిగింది. హీరోగానే ఛాన్సులివ్వనక్కర్లే యాంటోగనిస్టుగా సపోర్టింగ్ క్యారెక్టర్ ఇచ్చినా మహా ప్రసాదంలా స్వీకరిస్తున్నారు. ఇక అక్కడ ఫేడవుటైన సీనియర్ హీరోలకు వరంగానూ మారింది టాలీవుడ్. ఇక కెరీర్ ఖతం అనుకుంటున్న టైంలో బ్రేక్ ఇస్తున్నారు ఇక్కడ మేకర్స్. ఇప్పటికే సల్మాన్, సంజయ్ దత్, బాబీడియోల్, అర్జున్ రామ్ పాల్, వివేక్ ఓబెరాయ్, సైఫ్ అలీఖాన్ టాలీవుడ్లో మెరిస్తే.. ఈ జాబితాలోకి చేరారు మరికొందరు.
Also Read : RT 76 : టైటిల్ కూడా ఫిక్స్ కాకుండానే నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
బాలీవుడ్ రొమాంటిక్ హీరో లిప్ కిసెస్కు బ్రాండ్ అంబాసిడరైన ఇమ్రాన్ హష్మీ బీటౌన్‌లో మార్కెట్ కోల్పోతున్నాడు. ఆయన వెనుకొచ్చిన యంగ్ అండ్ డైనమిక్ హీరోలు ఇంటిమేట్ సీన్లలో ఈయనకంటే రెచ్చిపోతుంటే ఇమ్రాన్‌ను పట్టించుకునేదెవరు. యాక్షన్ వైపు టర్న్ తీసుకున్నా ఎవరు చూడలేదు. అందుకే టాలీవుడ్ నుండి యాంటోగనిస్టుగా ఆఫర్ రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఓజాస్ గంభీరతో ఓమీగా తలపడబోతున్నాడు. సెప్టెంబర్ 25న ఆగమనమౌతున్న ఓజీతో మన టాలీవుడ్‌కు కొత్త విలన్ దొరికేసినట్లే. గూఢచారి2లో అడవి శేష్‌తో ఢీకొట్టబోతున్నాడు హష్మీ. ఇక బాలీవుడ్‌కు బై బై చెప్పి సౌత్ సినిమాలపై ఇంప్రెషన్ పెంచుకున్న స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అడివి శేష్ హీరోగా నటిస్తోన్న డెకాయిట్‌తో ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మీర్జాపూర్ సిరీస్‌తో మున్నాభాయ్‌గా క్రేజ్ సంపాదించుకున్న దివ్యేందు శర్మ కూడా టాలీవుడ్లో బిగ్గెస్ట్ ఆఫర్ కొల్లగొట్టాడు. పెద్దిలో రామ్ చరణ్‌తో తలపడబోతున్నాడు. నాగ చైతన్య 24లో లాపతా లేడీస్ హీరో స్పర్శ్ శ్రీవాత్సవ్, మహాకాళితో అక్షయ్ ఖన్నా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇలా బాలీవుడ్ హీరోలు, డైరెక్టర్స్ కు టాలీవుడ్ ఒక దారి చూపిస్తోంది.
తాజావార్తలు
-
Sanjay Raut: కాంగ్రెస్‌లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్‌కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!