Tollywood : ఫేడవుటౌతున్న దర్శకులకు ఛాన్సులిస్తున్న హీరోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్క హిట్.. దర్శకుల్ని టాప్ ప్లేస్‌లో కూర్చొబెడుతుందో లేదో కానీ, ఫ్లాప్ మాత్రం వారికి నెక్ట్స్ సినిమా రాకుండా చేస్తుంది. సక్సెస్ లేని డైరెక్టర్స్‌కు ఆఫర్స్ ఇచ్చేందుకు వెనుకాడుతుంటారు హీరో అండ్ ప్రొడ్యూసర్స్. అలా ఫేడవుటౌతోన్న టాలీవుడ్ దర్శలకు మరో ఛాన్స్ ఇస్తున్నారు మన హీరోలు. వారిలో సీనియర్ మోస్ట్ శ్రీను వైట్ల ఒకరు. దూకుడు తర్వాత ఆ రేంజ్ దూకుడు ప్రదర్శించలేకపోయిన శ్రీను వైట్లతో నెక్ట్స్ మూవీని షురూ చేశాడు శర్వానంద్. 2027 సంక్రాంతికి ఈ మూవీ వస్తుందని నారీ నారీ నడుము మురారీ సక్సెస్ ఈవెంట్లో లీక్ చేశాడు శర్వా. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
Also Read : OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన శివకార్తికేయన్ లేటెస్ట్ రిలీజ్ పరాశక్తి
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
2021లో వచ్చిన సీటీమార్ తర్వాత మెగాఫోన్‌కు దూరమైన సంపత్ నందికి ఛాన్స్ ఇచ్చాడు శర్వా. ఈ ఇద్దరి కాంబోలో భోగి అనే మూవీ తెరకెక్కుబోతుంది. శర్వా38గా వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ అండ్ డింపుల్ హయాతి హీరోయిన్స్. అఖిల్‌కు ఏజెంట్‌తో భారీ డిజాస్టర్ ఇచ్చిన సురేందర్ రెడ్డికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆఫరిచ్చాడు. ఉగాదికి ఈ ప్రాజెక్ట్స్ స్టార్ట్ కాబోతుందన్నది లెటెస్ట్ బజ్. నాని, విజయ్ దేవరకొండతో సినిమా వర్కౌట్ కాకపోవడంతో చాలా గ్యాప్ తీసుకున్న శివ నిర్వాణకు రవితేజ ఆఫర్ చేయడం.. ప్రాజెక్ట్ పట్టాలెక్కడం చకా చకా జరిగిపోయాయి. ఈ ఇద్దరి కొలబరేషన్‌లో ఇరుముడి మూవీ రూపుదిద్దుకుంటోంది. ఇక నెక్ట్స్ ద ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ తర్వాత పత్తా లేకుండా పోయిన పరుశురామ్ కూడా ఓ స్టోరీని ప్రిపేర్ చేశాడని సమాచారం. సూర్యకు కథ చెప్పాడట. ఆల్ గుడ్ అనుకుంటే.. దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కించే ఛాన్స్ ఉంది. మరీ పరుశురామ్‌కు కోలీవుడ్ స్టార్ హీరో ఓకే చెబుతాడో లేదో లెట్స్ వెయిట్..
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..