బాలీవుడ్ పై క్లియర్ డామినేషన్ ప్రదర్శిస్తున్నారు మన తెలుగు హీరోలు. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి బాలీవుడ్‌కు ఛాలెంజింగ్ విసురుతున్నారు. త్రీ ఖాన్స్ కూడా టచ్ చేయలేని ఫీట్స్ సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఓపెనింగ్ డేస్‌లో తెలుగు హీరోలను కొట్టే మొనగాడు ఇంకా పుట్టేలేదు అన్నట్లుగా ఛేంజ్ అయ్యారు మన హీరోలు. దీనికి రాజమౌళి బాహుబలితో ఆజ్యం పోయగ పుష్ప2తో ఏకంగా సరికొత్త రికార్డు సెట్ చేసి పెట్టాడు సుకుమార్. వరల్డ్ వైడ్‌గా డే -1 రూ. 294 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్లను రాబట్టి డే వన్ హయ్యెస్ట్ కలెక్షన్లలో టాప్ -1 గా నిలవగా, టాప్ 5లో మన హీరోలే చైర్ వేసుకుని కూర్చున్నారు.
Also Read : Pushpa 2 : బాలీవుడ్ కి ఒక్కడే రాజ్.. అతడే ‘పుష్ప రాజ్’
టాప్ ప్లేసు పుష్పరాజ్ తీసుకుంటే మొన్నటి వరకు ఫస్ట్ బెంచ్ తీసుకున్న రాజమౌళి RRR ఇప్పుడు సెకండ్ బెంచ్‌కు షిఫ్ట్ అయ్యింది. థర్డ్, ఫోర్త్ ప్లేసులు తీసుకున్నాడు డార్లింగ్ ప్రభాస్. బాహుబలి2 రూ. 214 కోట్లతో మూడో స్థానం. ఈ ఏడాది వచ్చిన కల్కి 2898ఏడీ రూ. 191.5 కోట్లతో ఫోర్త్ ప్లేసులో నిలిచింది. ఇక దేవరోడితో ఫ్యాన్స్ కాలరెగరేసేలా చేసిన తారక్. బాలీవుడ్ థియేటర్లను షేక్ చేసిన తారక్ రూ.172 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్లతో ఫిఫ్త్ ప్లేసులో ఉన్నాడు. ఈ లెక్కన నాట్ ఓన్లీ బాలీవుడ్.. ఓవరాల్ సినీ ఇండస్ట్రీకి టాలీవుడ్ హీరోలు బ్రాండ్‌గా మారిపోయారు. ఇవేకాదు నెక్ట్స్ రాబోయే ,మహేశ్ – రాజమౌళి, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్, బన్నీ – త్రివిక్రమ్ సినిమాలు క్రియేట్ చేయబోయే రికార్డ్స్ తలుచుకుంటే బాలీవుడ్ ఖాన్స్ కు నిద్ర పట్టదని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.