తెలుగు సినిమాని విషాదంలోకి నెట్టిన సంఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కలను తెరపై చూపించేందుకు శ్రమించిన ఓ దర్శకుడు, తానే తెరకెక్కించిన సినిమా ప్రివ్యూను చూస్తుండగానే బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై కన్నుమూసిన విషాదకథ. దర్శకుడు సండ్రు నాగేష్ అలియాస్ రాంబాబు (47) తను డైరెక్ట్ చేసిన సినిమా ‘బ్రహ్మాండ’ ప్రివ్యూ చూస్తుండగా ఊహించని విధంగా బ్రెయిన్ స్ట్రోక్‌తో కుప్పకూలగా సినిమా విడుదలకు వారం రోజులే ఉన్న సమయంలో ఆయన మృతితో చిత్రయూనిట్ ఒక్కసారిగా షాక్‌కి లోనైంది.
Also Read: Chiranjeevi : విశ్వంభర సెట్స్ నుంచి మెగాస్టార్ లుక్..!
రాంబాబు ఎప్పటికైనా సినిమా తీసి చూపించాలనే పట్టుదలతో బ్రహ్మాండ అనే సినిమా చేసి పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకుని సెన్సార్ కానిచ్చుకుని విడుదలకు సిద్ధం చేశారు! ఆయన దర్శకత్వంలో తొలి సినిమా బ్రహ్మాండ! మంగళవారం రాత్రి ప్రివ్యూ షో చూస్తూ థియేటర్ లోనే చనిపోయారు. ఆ సినిమా అద్భుతంగా వచ్చిందనే ఆనందమో తెలియదు! ఇంకాస్త మెరుగులు దిద్దుకుని ఉంటే బావుంటుందని అనుకుంటూ ఒత్తిడికి గురయ్యారో తెలియదు కానీ మిత్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా తీవ్ర గుండెపోటు కు గురై మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు! నేడు స్వగ్రామం అల్లీపూర్ లో అంత్యక్రియలు జరిగాయి.
Also Read: Fish Venkat: ఫిష్ వెంకట్ కి హీరో ఆర్థిక సహాయం
సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో తెలంగాణ జానపద కళారూపమైన ఒగ్గుకథ నేపథ్యంలో “బ్రహ్మాండ” అనే చిత్రాన్ని దర్శకత్వం వహించారు రాంబాబు. జూలై 18న సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో ఆయన అకాల మరణం చిత్రయూనిట్‌ను దుఃఖ సాగరంలో ముంచెత్తింది. రాంబాబు సుమారు 150 సినిమాలు, 60 టీవీ సీరియల్స్‌కు కో-డైరెక్టర్‌గా పనిచేశారు. ఈటీవీ సీరియల్స్ “అంతరంగాలు”, “అన్వేషణ” వంటి షోలకు ఆయన కీలకంగా పనిచేశారు.