కరాటే కళ్యాణి తల్లి విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరాటే కళ్యాణి మరియు మౌక్తిక నిన్న వెళ్లారు.. ఎక్కడికి వెళ్ళారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు..నిన్నటి నుండి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని.. నా కూతురు పై కావాలని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు. తమ దగ్గర డబ్బులు తీసుకొని మాపైనే ఆరోపణలు చేస్తున్నారని… శ్రీకాంత్ రెడ్డి నా కూతురు పై అటాక్ చేస్తానని బెదిరించాడని వెల్లడించారు.
నిన్నటి నుండి కూతురు కళ్యాణి, పాపా మౌక్తిక ను ఎవరు తీసుకొని వెళ్లారో…వారు ఎక్కడ ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్లను కిడ్నాప్ చేశారని ఆరోపణలు చేశారు కరాటే కళ్యాణి తల్లి విజయలక్ష్మి. నిన్న చైల్డ్ వెల్ఫర్ వారు వచ్చారు..చిన్న పిల్లలను అక్రమంగా తీసుకొని వచ్చారా అని మమ్మల్ని ప్రశ్నించారన్నారు. నిజానిజాలు వెల్ఫేర్ అధికారులకు తెలియచేసాము…కల్యాణి, 5 నెలల పాపా ఎక్కడ ఉన్నారో వివరాలు తెలియజేయాలి అని కోరుతున్నానని వెల్లడించారు కరాటే కళ్యాణి తల్లి విజయలక్ష్మి.
నిన్న కరాటే కళ్యాణి వద్ద ఉన్న చిన్నారి పై సస్పెన్స్ కొనసాగింది. ఈ నేపథ్యంలోనే.. శ్రీకాంత్ రెడ్డి-కళ్యాణి కేసులో తెరపైకి మరో ట్విస్ట్ వచ్చింది. కరాటే కళ్యాణి చిన్నారిని అక్రమంగా దత్తతకు తీసుకుందనీ చైల్డ్ లైన్ హెల్ప్ డెస్క్ 1098 కు ఫిర్యాదు అందింది. కళ్యాణి వద్ద ఉన్న చిన్నారి చట్ట బద్దంగానే దత్తత తీసుకుందా ? చిన్నారిని కల్యాణికి అపగించింది ఎవరు ? ఎవరీ మధ్యవర్తిత్వం ద్వారా ఎక్కడి నుండి కళ్యాణి చిన్నారిని తెచ్చుకుందా అనే దానిపై విచారణ చేశారు.
అయితే ఇవాళ చైల్డ్ లైన్ అధికారులకు స్పష్టత కోసం కరాటే కళ్యాణి నివాసానికి వెల్లనుండగా.. కరాటే కళ్యాణి తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అధికారులు కళ్యాణిని వెతికే పనిలో పడ్డారు. అసలు కళ్యాణి, పాప జాడ ఏమయ్యిందని పోలీసులకు ప్రశ్నార్థకంగా మరింది. శ్రీకాంత్ రెడ్డి తన కూతురు పై అటాక్ చేస్తానని బెదింరించాడని తల్లి విజయమ్మ వెల్లడించడంతో.. ఈ ఘటన మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.