Prabhas Fans Celebrated his advance happy birthday : మరికొద్ది రోజుల్లో రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు రాబోతోంది. ఈ పుట్టినరోజు సందర్భంగా పలు చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. అయితే ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు కాస్త ముందుగానే మొదలైపోయాయి. ప్రభాస్ కి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం ఇండియా వైడ్ మాత్రమే కాదు జపాన్ చైనా లాంటి దేశంలో కూడా ఆయనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా ఇతర దేశాల్లో కూడా రిలీజ్ అయింది. అక్కడ మంచి క్రేజ్ తెచ్చుకుంది.
Narudi Bathuku Natana: అక్టోబర్ 25న ‘నరుడి బ్రతుకు నటన’.. టీజీ విశ్వప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆ తర్వాత ప్రభాస్ కి అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దాదాపుగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న అన్ని సినిమాలను లేట్ అయినా సరే ఇతర దేశాల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలను టోక్యో ప్రభాస్ అభిమానులు ముందుగానే జరుపుకున్నారు. ప్రభాస్ కెరీర్ లో భారీ డిజాస్టర్ గా నిలిచిన రాధే శ్యామ్ సినిమా చూస్తూ వాళ్ళు ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న పలు చిత్రాల నుంచి అప్డేట్స్ రిలీజ్ అయ్యాయి.