శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్ వంటి వారు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకి రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 25న సినిమా రిలీజ్ కానున్న క్రమంలో శనివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు సుధీర్ బాబు, దర్శకులు వీరశంకర్, వీజే సన్నీ, శ్రీరామ్ ఆదిత్య, వితిక షెరు వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ప్యాషన్, డబ్బులుంటే సినిమాల్ని తీయలేం. నేను ప్రారంభంలో కొన్ని చిత్రాలను నిర్మించాను. అవి ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ప్రదర్శించగలిగాను.
Bigg Boss 8: మరో షాకింగ్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరంటే?
కానీ థియేట్రికల్ రిలీజ్ చేయలేకపోయాను. ఈ ‘నరుడి బ్రతుకు నటన’ టీంని చూసినప్పుడు నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. అందుకే వారికి సాయం చేయాలని ముందుకు వచ్చాను. అక్టోబర్ 25న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి టీంను సపోర్ట్ చేయండి’ అని అన్నారు. డైరెక్టర్ రిషికేశ్వర్ యోగి మాట్లాడుతూ.. ‘మా సినిమాను టేకప్ చేసిన టీజీ విశ్వ ప్రసాద్ గారికి థాంక్స్. మా ఈవెంట్‌కు వచ్చిన సుదీర్ బాబు గారికి, శ్రీరామ్ ఆదిత్య గారికి థాంక్స్. శివ, నితిన్ వంటి యాక్టర్లు లేకపోయి ఉంటే.. ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. నాకు సపోర్ట్ చేసిన మా టెక్నికల్ టీంకు థాంక్స్. మా చిత్రం అక్టోబర్ 25న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.