మలయాళ సినిమా పరిశ్రమ వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే 2025లో విడుదలైన మోహన్‌లాల్ నటించిన తుడరుం మోలీవుడ్ చరిత్రలో అత్యధిక హౌస్‌ఫుల్ షోల రికార్డును సృష్టించింది. ఈ క్రైమ్ థ్రిల్లర్, థరుణ్ మూర్తి దర్శకత్వంలో, రేజపుత్ర విజువల్ మీడియా నిర్మాణంలో, బాక్స్ ఆఫీస్‌ను శాసించింది. మోహన్‌లాల్ షణ్ముగం (బెంజ్), టాక్సీ డ్రైవర్‌గా, శోభనతో కలిసి ఎమోషనల్ యాక్టింగ్ తో మెప్పించారు. రన్ని అనే పట్టణంలో జరిగే కథలో క్రైమ్, ఫ్యామిలీ డ్రామా అద్భుతంగా సెట్ అయ్యాయి. ఈ చిత్రం 6 రోజుల్లో 100 కోట్ల క్లబ్‌లో చేరి, 10 రోజుల్లో 162.69 కోట్ల గ్రాస్‌తో నాల్గవ అత్యధిక వసూళ్ల చిత్రంగా నిలిచింది. కేరళలో రోజుకు 5 కోట్ల కలెక్షన్‌తో 10 రోజుల రికార్డు సృష్టించింది. జేక్స్ బిజోయ్ సంగీతం, “కన్మణిపూవే”, “కథ తుడరుం” పాటలు ప్రేక్షకులను ఆకర్షించాయి.
Read More: Bandi Sanjay : “కాంగ్రెస్ ఖేల్ ఖతం… దుకాణ్ బంద్”
తుడరుం మోలీవుడ్ చరిత్రలో అత్యధిక హౌస్‌ఫుల్ షోలను సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. విడుదలైన 10 రోజుల్లో, ఈ చిత్రం కేరళలోని సినిమా థియేటర్లలో అపూర్వమైన ఆదరణ పొందింది. ముఖ్యంగా కేరళలో 10 రోజుల పాటు రోజుకు 5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన మొదటి మలయాళ చిత్రంగా నిలిచింది. ఈ రికార్డు గతంలో మోహన్‌లాల్ నటించిన L2: ఎంపురాన్ చిత్రం 7 రోజుల పాటు 5 కోట్ల రూపాయల కలెక్షన్‌తో సాధించిన రికార్డును అధిగమించింది. 2025లో మోహన్‌లాల్ L2: ఎంపురాన్తో పాటు ఈ చిత్రంతో రెండు 100 కోట్ల చిత్రాలను అందించారు.