బాక్సాఫీస్ దగ్గర నలుగురు బిగ్ హీరోస్ ఫైట్ చేసుకుంటే వెరైటీ ఏముంటుంది అదే ఫోర్ కమెడియన్స్ సై అంటే సై అంటుంటే కాస్త కామెడీ అనిపించినా మేటర్ మాత్రం సీరియస్సే. ప్రజెంట్ ఈ సిచ్యుయేషన్ కోలీవుడ్‌లో నెలకొంది. ఒక్కరు కాదు నలుగురు స్టార్ కమెడియన్స్ ఒకే రోజు తలపడుతున్నారు. కోలీవుడ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కమెడియన్ సంతానం డీడీ నెక్ట్స్ లెవల్ అంటూ హారర్ కామెడీతో వస్తున్నాడు. పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు.
Also Read : Jana Nayagan : పార్టీ పేరును సినిమాలో క్యారెక్టర్ పేరుగా పెట్టుకున్న స్టార్ హీరో
కామెడీ రోల్స్ నుండి సడెన్లీ ట్రాక్ మార్చి సీరియస్ కథలకు షిఫ్టయ్యాడు సూరి. విడుదల, గరుడన్‌తో హిట్ అందుకున్న స్టార్ కమెడియన్.. మరోసారి ఫక్తు యాక్షన్ డ్రామాను నమ్ముకున్నాడు. ‘మామన్’ అనే మూవీతో మే 16న ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్. ఇక ప్రజెంట్ కోలీవుడ్ టాప్ కమెడియన్ అయిన యోగిబాబు ‘జోరా కై తట్టుంగ’ సినిమాతో వచ్చేస్తున్నాడు. ఇది కూడా అదే రోజు థియేటర్లలోకి రాబోతుంది. ఈ టఫ్ కాంపిటీషన్ మధ్యలో స్టార్ కమెడియన్లకే థియేటర్లు దొరకడం కష్టం అనుకుంటే మధ్యలో నేనున్నానంటున్నాడు సూపర్ సీనియర్ వడివేలు. అది కూడా రీరిలీజ్ తో వీరితో ఫైట్‌కు దిగుతున్నాడు. 2002లో మురళి, వడివేలు హిలేరియస్‌గా ప్రేక్షకులను నవ్వించిన బొమ్మ సుందరం ట్రావెల్స్ మే 16న మళ్లీ విడుదల చేస్తున్నారు మేకర్స్. సమ్మర్ సీజన్లో స్టార్ హీరోల చిత్రాలకు రావడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచనలో పడుతున్నారు ఆడియన్స్. సినిమా మొత్తం కమర్షియల్, మాస్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్‌లో చూస్తున్నతమిళ తంబీలు. కంటెంట్ బాగుంటే చిన్న సినిమాను కూడా ఆదరిస్తుంటారు. చాలా సార్లు ఫ్రూవ్ అయ్యింది. కానీ సమ్మర్ సీజన్లో అది ఒకే రోజున బొమ్మలను తెస్తున్నారంటే టికెట్లు తెగుతాయా అన్నది డౌటే.