శాండిల్ వుడ్ కలిసొచ్చినట్లుగా కన్నడ కస్తూరీ రుక్మిణీ వసంత్‌కు టాలీవుడ్, కోలీవుడ్ అస్సలు అచ్చి రావడం లేదు. సప్తసాగరాలు దాచే ఎల్లోతో ఆమెకు వచ్చిన హైప్‌తో టాలీవుడ్ మేడమ్‌కు డోర్స్ ఓపెన్స్ చేసింది. నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడోకి ఎందుకు కమిటైందో కానీ బొమ్మ వచ్చిందీ వెళ్లిన విషయం కూడా తెలియదు. దీంతో ఫెర్మామెన్స్ ప్రదర్శించడానికి స్కోప్ లేకుండా పోయింది భామకు. టాలీవుడ్ భయంకరమైన రిజల్ట్ ఇస్తే తమిళంలో ఇదే సిచ్యుయేషన్ రిపీట్ అయ్యింది. విజయ్ సేతుపతి ఏస్‌లో నటించింది. రుక్మిణీ స్టన్నింగ్ లుక్స్ కు పడిపోయారు తమిళ తంబీలు. కానీ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర బెడిసికొట్టింది.
Also Read : Tollywood : టాలీవుడ్ యంగ్ లవ్ కపుల్స్.. పెళ్లి పీటలు ఎక్కుతారా?
అయితే మదరాసితో గట్టెక్కెస్తాననుకుంటే సినిమా ఎంగేజింగ్‌గా లేదని టాక్ వచ్చింది. తుపాకీ, కత్తిని కలిపి మదరాసి అనే కొత్త కర్రీ వండడని మురుగుదాస్‌ను ఏకేస్తున్నారు. అయితే గుడ్డి కన్నా మెల్ల మేలు అన్నట్లుగా.. సికిందర్ కన్నా మదరాసి కాస్త బెటర్ అన్న ఫీలవుతున్నారు. ఆగస్టు 5న రిలీజైన మదరాసి మిక్స్ డ్ రివ్యూస్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తమిళ్ లో సూపర్ స్టార్ట్ అందుకుంది. కానీ ఈ సినిమా రుక్మిణి కి ఆశించిన ఫలితం అయితే ఇవ్వలేదు. మరోవైపు రుక్మిణీ ఖాతాలో ప్లాప్స్ ఉన్నా కన్నడ ఇండస్ట్రీ అవేమీ పట్టించుకోకుండా భారీ ఆఫర్లు కట్టబెడుతోంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్‌తో పాటు టాక్సిక్, తారక్- ప్రశాంత్ నీల్ మూవీలో హీరోయిన్‌గా ఫిక్సైనట్లు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక మేడమ్ హిట్ కొట్టడమే తరువాయి. రుక్మిణీ వసంత్‌ను ఇప్పుడు రిషబ్ శెట్టి, ఎన్టీఆర్ లే కాపాడాలి. రుక్మిణి కెరీర్ కు బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలి.