కొంత మంది స్టార్ భామలకు వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురైనా వారి క్రేజ్ ఏమాత్రం తగ్గదు. పూజాహేగ్డే, శ్రీలీల ఈ కోవకే వస్తారు. ఇప్పుడు వీరికి తోడయ్యింది మృణాల్ ఠాకూర్. సౌత్‌లో ప్యామిలీ స్టార్ తప్ప మిగిలినవన్నీ హిట్స్. కానీ.. నార్త్‌లో సీతామహాలక్ష్మి వరుస డిజాస్టర్లను చూసింది. అయినా సరే ఆఫర్స్ కి కొదవ లేదు. 6 ఏళ్ల నుండి బీటౌన్‌లో హిట్టే చూడని భామకు నార్త్ బెల్ట్ వరుస ఆఫర్లు ఇచ్చి రెడ్ కార్పెట్ వేయడం విడ్డూరం.
హృతిక్ సూపర్ 30, బాట్లా హౌస్ తర్వాత బీటౌన్‌లో బ్లాక్ బస్టర్ సౌండ్ వినలేదు మృణాల్. కరోనా ఎఫెక్ట్ వల్ల ఓటీటీకి పరిమితమైన ఈ భామ జెర్సీతో థియేటర్ ప్రేక్షకులను పలకరిస్తే రిజల్ట్ ప్లాప్. ఇక అదే టైంలో టాలీవుడ్‌లో సీతామాహాలక్ష్మీగా ఎంటరై భారీ సక్సెస్ తెచ్చుకోవడంతో మేడమ్ క్రేజ్ అమాంతం పెరిగింది. దీంతో బీటౌన్ కూడా వరుస ఆఫర్లు ఇస్తూ ఎంకరేజ్ చేసింది. కానీ గుమ్రా, ఆంఖ్ మిచోలీ డిజాస్టర్లుగా మారాయి. గోస్ట్ స్టోరీస్, లస్ట్ స్టోరీస్ సిరీస్ చిత్రాలతో కాస్తో కూస్తో ఇమేజ్ నిలబడింది. తెలుగులో హాయ్ నాన్న హిట్టు మరోసారి ఆమె కెరీర్‌కు బూస్టర్ అయ్యింది. ఇలా ఆమె బీటౌన్ ముంగిట్లో ఫెయిలవుతున్న ప్రతిసారి టాలీవుడ్ ఆదుకుంది. బాలీవుడ్‌లో వరుస ప్లాపులున్నా టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ వల్ల ఆఫర్స్ క్యూ కడుతున్నాయి . ప్రస్తుతం అజయ్ దేవగన్ సన్నాఫ్ సర్దార్ 2లో నటిస్తోంది. జులై 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇవే కాదు మేడమ్ చేతిలో హై జవానీ తో ఇష్క్ హోనా హై, తుమ్ హో తో, పూజా మేరీ జాన్ కాకుండా బైలింగ్వల్ డెకాయిట్, హై ఆక్టేన్ పాన్ ఇండియా మూవీ అల్లు అర్జున్, అట్లీ మూవీలోను నటిస్తుంది. మరి మృణాల్ బాలీవుడ్ హిట్ కల ఎప్పుడు తీరుతుందో.