Prabhas The Raja Saab Final Runtime: రెబల్ స్టార్ ‘ప్రభాస్’ నటించిన తాజాగా సినిమా ‘ది రాజాసాబ్’ రన్‌టైమ్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. మూవీ రన్‌టైమ్ 3 గంటలా 14 నిమిషాలు, 3 గంటలా 3 నిమిషాలు, 2 గంటలా 55 నిమిషాలు అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా సినిమా రన్‌టైమ్‌పై స్పష్టత వచ్చింది. రాజాసాబ్ ఫైనల్ రన్‌టైమ్‌ను 189 నిముషాలుగా లాక్ చేశారు. అంటే సినిమా 3 గంటలా 9 నిమిషాలు ఉంటుంది. సినిమాకు సెన్సార్ బోర్డ్ మూవీకి U/A సర్టిఫికెట్ ఇచ్చింది.
ఇటీవల ప్రభాస్ నటించిన అన్ని సినిమాల రన్‌టైమ్ 3 గంటలపైనే ఉంది. డైరెక్టర్ మారుతి సినిమాలు మాత్రం తక్కువ నిడివితో రిలీజ్ అయ్యాయి. ఇద్దరి కాంబోలో వస్తోన్న తొలి సినిమా కావడం, అందులోనూ హారర్ కామెడీతో వస్తుండటంతో రాజాసాబ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో ప్రభాస్ చేసిన కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారని మారుతి చెప్పిన విషయం తెలిసిందే. ప్రభాస్ కూడా చాలా ఏళ్ల తర్వాత కామెడీ సినిమా చేశానని చెప్పారు. దాంతో రాజాసాబ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజాసాబ్‌గా ప్రభాస్ చేసే అల్లరి కోసం రెబల్ స్టార్ ఫాన్స్ వేచి చూస్తున్నారు.
Also Read: Toxic Movie: మోడ్రన్ డ్రెస్, పబ్.. ‘మెలిసా’గా రుక్మిణీ వసంత్ అదుర్స్!
రాజాసాబ్ ప్రభాస్ సరసన హాట్ భామలు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ కథానాయికలుగా కనిపిస్తారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినా.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా 2026 జనవరి 9కు వాయిదా పడింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్ రాజాసాబ్‌ను నిర్మించారు. ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. సినిమా విడుదలకు మరో రెండు రోజులే ఉండడంతో.. చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది.