కన్నడ స్టార్ యశ్ హీరోగా, మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న సినిమా ‘టాక్సిక్’. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్‌లైన్. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంకు హీరో యశ్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యశ్ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న టాక్సిక్.. మార్చి 19న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కేజీయఫ్’ తర్వాత యశ్ నటిస్తున్న సినిమా కావడంతో.. టాక్సిక్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుసగా నటీమణులను పరిచయం చేస్తూ.. ఆ అంచనాలను మరింతగా పెంచుతోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలో టాక్సిక్‌లో యువ హీరోయిన్ రుక్మిణీ వసంత్ ఉన్నట్లు అధికారికంగా తెలిపింది.
టాక్సిక్ సినిమాలో ‘మెలిసా’ అనే పాత్రలో రుక్మిణీ వసంత్ కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. మోడ్రన్ డ్రెస్‌లో పబ్‌లో నడుస్తున్న రుక్మిణీ ఫస్ట్ లుక్‌ను వదిలారు. మోడ్రన్ డ్రెస్‌లో ఆమె చాలా బాగున్నారు. ఈ పోస్టర్ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పోస్టర్‌కు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. రుక్మిణీ నయా లుక్‌కు ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ‘కాంతారా 2’లో కనకవతి అనే పాత్రలో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
Also Read: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. స్లిమ్ బాడీ, ఫ్లాట్ డిస్‌ప్లేతో Realme 16 Pro Launch!
టాక్సిక్ సినిమా నుంచి ఇప్పటికే ముగ్గురు హీరోయిన్‌ల లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కియారా అద్వానీ నదియా పాత్రలో, హ్యుమా ఖురేషీ ఎలిజబెత్ పాత్రలో, నయనతార గంగ పాత్రలో కనిపించనున్నారు. రుక్మిణీ వసంత్ ఎంట్రీతో టాక్సిక్ హీరోయిన్‌ల సంఖ్య నాలుగుకు చేరింది. మొత్తానికి అన్ని పోస్టర్‌లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. చిత్ర బృందం ఇంకేమైనా ట్విస్ట్ ఇస్తుందో చూడాలి. టాక్సిక్‌కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
Introducing Rukmini Vasanth @rukminitweets as MELLISA in – A Toxic Fairy Tale For Grown-Ups#TOXIC #TOXICTheMovie #Nayanthara @humasqureshi @advani_kiara #TaraSutaria #GeetuMohandas @RaviBasrur #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva… pic.twitter.com/jv83SVLzYu
— Yash (@TheNameIsYash) January 6, 2026