The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise: ‘దసరా’ వంటి పాన్ – ఇండియా బ్లాక్‌బస్టర్‌తో మొదటి ప్రయత్నంలోనే బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు యువ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఇప్పుడు మళ్లీ అదే నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో ‘ది ప్యారడైజ్’ అనే మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న వేళ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
“ఆడియన్స్ అంటే భయపడుతున్నా.. అందుకే ఆ లేట్”
ప్యారడైజ్ ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు రాఘవ్ జుయల్‌తో నిర్వహించిన ‘నో ఫిల్టర్ జస్ట్ డ్రైవ్’ చిట్‌చాట్‌లో శ్రీకాంత్ ఓదెల తన మనసులోని అసలు భయాన్ని బయటపెట్టారు. “ప్రస్తుతం నాకు ఆడియన్స్ అంటే చాలా భయం వేస్తోంది. థియేటర్‌కు వచ్చే ప్రతి ఒక్క ప్రేక్షకుడు సంతృప్తి చెందాలన్నదే నా తపన. ఆ ఉద్దేశంతోనే చిన్న చిన్న అవుట్‌పుట్ విషయాల్లో కూడా ఎక్కడా అంగుళం కూడా రాజీ పడటం లేదు. ఈ పెర్ఫెక్షన్ వల్లే షూటింగ్ ఆలస్యమై ప్రొడక్షన్ ఖర్చులు పెరిగాయి, ఆర్టిస్టుల కాల్షీట్లపై ప్రభావం పడింది. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ఆడియన్స్‌కు ఒక అత్యుత్తమ అనుభూతిని అందించాలన్నదే నా తాపత్రయం” అని శ్రీకాంత్ కుండబద్దలు కొట్టారు. తన ఫస్ట్ చిత్రం ‘దసరా’తో పోలిస్తే ‘ది ప్యారడైజ్’ విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నమని శ్రీకాంత్ వివరించారు. ‘దసరా’ తీసే టైంలో సినిమా బిజినెస్ లెక్కలు, ప్రేక్షకుల రియాక్షన్స్ గురించి తనకు ఎలాంటి అవగాహనా లేదని, అంతా చాలా అమాయకంగా సాగిపోయిందని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో కేవలం సినిమా తీయడం మాత్రమే తన పని అని, మిగిలిన వ్యవహారాలన్నీ నాని, నిర్మాత సుధాకర్ చెరుకూరి చూసుకున్నారని చెప్పారు. కానీ ‘ది ప్యారడైజ్’ కి వచ్చేసరికి ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్ని తాకాయని, ప్రతి ఫ్రేమ్‌లోనూ తనపై పెద్ద బాధ్యత ఉందని వెల్లడించారు.
Also Read
- Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
- Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
- Kabir Duhan Singh: 'హనుమాన్ అంశ్' బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
ప్రేక్షకులతో ఎప్పటికప్పుడు కనెక్ట్ అయి ఉంటూ, వారి రెస్పాన్స్‌కి అనుగుణంగా డబ్బింగ్, సౌండ్ వంటి సాంకేతిక అంశాలను సరిదిద్దుకునే పద్ధతిని తాను శ్రీకాంత్, నానిల నుంచే నేర్చుకున్నానని ఈ సందర్భంగా నటుడు రాఘవ్ జుయల్ ప్రశంసించారు. మోహన్ బాబు, కయాదు లోహర్, సోనాలి కులకర్ణి వంటి భారీ తారాగణంతో అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్‌తో వస్తున్న ‘ది ప్యారడైజ్’పై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరాయి. దర్శకుడు ఇంత పక్కాగా, ప్రేక్షకుల పట్ల బాధ్యతగా చెక్కిన ఈ విజువల్ వండర్ సెప్టెంబర్ 24న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!