The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో మరోసారి సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ది ప్యారడైజ్’ ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, టికెట్ ధరలను భారీగా పెంచుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ అధికారిక మెమో (నెం. 3419722/General.A/A1/2026) జారీ చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై నిర్మాత చెరుకూరి సుధాకర్ సమర్పించిన వినతి మేరకు ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. సెప్టెంబర్ 23 సాయంత్రం అంటే సినిమా అధికారిక విడుదలకు ఒక రోజు ముందే ప్రదర్శించే స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధరలను మల్టీప్లెక్స్‌లలో రూ. 400 (జీఎస్టీతో కలిపి), సింగిల్ స్క్రీన్లలో రూ. 300 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించారు.
కేవలం ప్రీమియర్ షోలకే పరిమితం కాకుండా, సినిమా విడుదలైన తొలి పది రోజుల పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతినిచ్చారు. ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లకు అదనంగా: మల్టీప్లెక్స్‌లలో ప్రతి టికెట్‌పై రూ. 75 పెంచుకునే అవకాశంతో పాటు సింగిల్ స్క్రీన్లలో ప్రతి టికెట్‌పై రూ. 50 అదనపు పెంపు అమలులోకి రానుంది. నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కయాదు హీరోయిన్ గా, సంపూర్నేష్ బాబు, మోహన్ బాబు, రాఘవ జుయాల్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.
Also Read
- Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
- Kartikeya Gummakonda : తన 'కమ్‌బ్యాక్' కోసం మెగాఫోన్ పట్టిన 'ఆర్ఎక్స్ 100' హీరో..
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
తాజావార్తలు
-
The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
-
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
-
US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
-
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్!
-
Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!