మాస్ జాతరతో లాస్ట్ ఫోర్ ప్లాప్స్ లెక్కలు సరిచేయాలనుకుంటున్నాడు మాస్ మహారాజ్. సోలో హీరోగా ధమాకా తర్వాత హిట్ చూడని రవితేజ. ఈసారి మనం కూడా కొట్టినం అనే టాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ దిశగా తన వంతు కృషి చేస్తున్నాడు. తన కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీ అయిన ధమాకాలో యాక్ట్ చేసిన శ్రీలీలతో కలిసి మరోసారి జోడీ కట్టి మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు. భాను భోగవరపు దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతోన్న ఈ మూవీ ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మాస్ జాతర ఇటు రవితేజకి, అటు శ్రీలీలకు, నయా దర్శకుడికి మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్.
Also Read : NBK : అఖండ – 2 కోసం బాలయ్య రంగంలోకి దిగాడు.. పోటీ వచ్చే వాళ్ళు రావచ్చు
ప్రజెంట్ రవితేజ తన నెక్ట్స్ సినిమాల విషయంలో రిస్క్‌కు రెడీ అవుతున్నాడు రవితేజ. ఓ మూవీ సెట్స్ పై ఉండగానే మరో మూవీకి కమిటవుతుంటాడు రవితేజ. ఈ కమిట్మెంట్ మంచిదే కానీ ఫాస్ట్‌గా సినిమాలు చేయాలన్న ఆలోచనతో ప్లాప్ దర్శకులకు ఛాన్సులిస్తున్నాడు. మాస్ జాతర ఇలా పూర్తయ్యిందో లేదో కిశోర్ తిరుమల మూవీని పట్టాలెక్కించాడు. ఆడాళ్లు మీకు జోహార్లు ప్లాప్ తర్వాత గ్యాప్ తీసుకుని కిశోర్ చేస్తున్న ఫిల్మ్ ఇది. అలాగే ధమాకాతో తనను వంద కోట్ల హీరోగా మార్చిన త్రినాథ రావు నక్కినకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. మజాకాతో సోసో అనిపించుకున్న త్రినాథరావు రవితేజతో ధమాకా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడని గతంలో వినిపించిన బజ్. ఇదే కాదు రీసెంట్లీ ఈ జాబితాలో చేరాడు కన్నడ దర్శకుడు ఏపీ అర్జున్. మార్టిన్ వంటి భారీ ప్లాప్ అందించాడు ఈ డైరెక్టర్. ఇలా వరుసగా ప్లాప్ సినిమా డైరెక్టర్స్ కు పిలిచి మరి అవకాశలు ఇస్తున్నాడు. ప్రస్తుతానికి మాస్ మహారాజ్ లైనప్‌లో ఉన్న హిట్ దర్శకుడు మ్యాడ్ స్క్వేర్ ఫేం కళ్యాణ్ శంకర్ మాత్రమే.