‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’… కొన్నాళ్ల క్రితం అమేజాన్ ప్రైమ్ లో రిలీజైన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు సూపర్ సక్సెస్ ఫుల్ ట్యాగ్ సంపాదించుకుంది. ఆశించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అయితే, సమంత తొలిసారి బాలీవుడ్ లో కాలుపెట్టిన ఈ వెబ్ సిరీస్ కాంట్రవర్సీకి కూడా తెర తీసింది. సామ్ ఓ తమిళ అతివాదిగా కనిపించటం చాలా మందికి నచ్చలేదు. అలాగే, ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’లో ఆమె కొన్ని ఇంటిమేట్ సీన్స్ కూడా చేయక తప్పలేదు. అది చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. సినిమాలతో పొలిస్తే తొలి వెబ్ సిరీస్ లోనే సామ్ బోల్డ్ గా నటించి, మెప్పించిందని ఒప్పుకోక తప్పదు…
‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’లో సమంత పాత్ర, ఆమె చేసిన బోల్డ్ సీన్స్ మొదట్లో చర్చకి కారణమైతే… అదే షోలో నటించిన షాహబ్ అలీ తాజాగా కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. సమంత అతడితో కథలో భాగంగా ఇంటమేట్ సీన్స్ చేసిందట. వారిద్దరూ ప్రేమలో పడ్డారని తెలిపేలా మేకర్స్ కొన్ని శృంగార సన్నివేశాలు చిత్రీకరించారట. అయితే, వాటిలో చాలా వరకూ ఫైనల్ ఎడిటింగ్ లో తొలగించారని షాహబ్ అలీ వివరించాడు. అందుక్కారణం కూడా ఆయన చెప్పాడు.
Read Also : 500 చిత్రాల్లో నటించిన అనుపమ్ ఖేర్ అమాయకుడి చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు!
వెబ్ సిరీస్ సినిమా కంటే నిడివి ఎక్కువగా ఉంటుంది. దాంతో షూటింగ్ సమయంలో అనేక సన్నివేశాలు చిత్రీకరిస్తారు. అవన్నీ ఫైనల్ వర్షన్ లో ఉండకపోవచ్చు. తప్పనిసరిగా అవసరం అనుకుంటేనే డైరెక్టర్స్ కొన్ని సీన్స్ ని ఆడియన్స్ ముందుకి తీసుకువస్తారు. అలాగే, లాజిక్ లేదని అనిపించిన సీన్స్ కూడా అనవసరంగా భావించి చివరి నిమిషంలో పక్కకు పెట్టేస్తుంటారు. ఈ విధంగా ఎడిటింగ్ టేబుల్ పై నుంచీ డస్ట్ బిన్ కు వెళ్లిపోయే సీన్స్ చాలా ఉంటాయి. అదే జరిగింది ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ విషయంలోనూ! చాలా రకాల సీన్స్ ఫైనల్ వర్షన్ లో చోటు దక్కించుకోలేదు. సమంత, షాహబ్ అలీ నడుమ సాగిన బెడ్ రూమ్ సీన్స్ కూడా అలాగే పక్కకు జారిపోయాయి…
సమంత డెబ్యూ వెబ్ సిరీస్ లో ఇప్పుడు జనం ముందుకొచ్చిన ఒకట్రెండు సీన్సే ఫుల్ గా షాక్ ఇచ్చాయి. ఒకవేళ మొత్తం హాట్ సీన్స్ అన్నీ ‘ద ఫ్యామిలీ మ్యాన్’ మేకర్స్ మన మీద గుమ్మరించి ఉంటే… పరిస్థితి ఎలా ఉండేదో! ‘ఫ్యామిలీ మ్యాన్’ కహానీ ‘ఫ్యామిలీ షో’ లాగా లేదని గగ్గోలు పెట్టేవారేమో…!