తనకు రామ్ చరణ్‌తో ఎలాంటి మనస్పర్థలు లేవని సంగీత దర్శకుడు తమన్ చెప్పుకొచ్చాడు. గతంలో నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన అన్నాడు. నిజానికి, ఈ ఏడాది మార్చి నెలలో తమన్ రామ్ చరణ్ డాన్స్ గురించి చేసిన కామెంట్ వైరల్ అయింది. అసలు విషయం ఏమిటంటే, యూట్యూబ్‌లో వచ్చే వ్యూస్ గురించి తమన్ మాట్లాడుతూ, హుక్ స్టెప్స్ ఉంటే పాటలు ఇంకా జనాల్లోకి వెళ్లడానికి ఈజీ అవుతుందని చెప్పుకొచ్చాడు. గేమ్ చేంజర్ సినిమాలో హుక్ స్టెప్స్ లేవని, అల వైకుంఠపురంలో హుక్ స్టెప్స్ ఉన్నాయని, అందుకే గేమ్ చేంజర్‌లో పాటలు బాగున్నా, అల వైకుంఠపురంలో వచ్చిన వ్యూస్ రాలేదని చెప్పుకొచ్చాడు. అయితే, ఈ విషయంలో అల్లు అర్జున్‌తో కంపేర్ చేస్తూ మాట్లాడడంతో రామ్ చరణ్ అభిమానులు తమన్ మీద ఫైర్ అయ్యారు.
Also Read:Ram Charan: ఏంటి తమన్ …. OG కోసం చేతులపై కిరోసిన్ పోసుకుని వాయించావా?
తాజాగా ఓజి రిలీజ్ తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్, తన బాధ రామ్ చరణ్ లాంటి ఒక మంచి డాన్సర్‌ని వాడుకోలేకపోయారని చెప్పుకొచ్చాడు. పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్లు ఈ సినిమా కోసం పనిచేశారు, కానీ రామ్ చరణ్ లాంటి సూపర్ డాన్సర్‌ని పూర్తిస్థాయిలో వాడుకోలేకపోయారు, కాబట్టి ఆ సినిమా కిక్ ఇవ్వలేకపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక్కడ తన కంప్లైంట్ కొరియోగ్రాఫర్ల మీదే, కానీ రామ్ చరణ్‌తో కాదని, మేము మేము బాగానే ఉన్నామని చెప్పాడు. కానీ, ఎవరో ఏదో రాసిన దాన్ని అపార్థం చేసుకుని ఫాన్స్ హర్ట్ అయ్యారని చెప్పుకొచ్చాడు.