పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా, సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్‌తో కలుపుకొని మొదటి రోజే 154 కోట్ల రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టి, పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. నిజానికి, ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా, వర్షాలు, టికెట్ రేట్లు వంటి కారణాలతో సినిమా బుకింగ్స్ సరిగా నమోదు కావడం లేదు. ఆ సంగతి ఎలా ఉన్నా, ఈ సినిమాకి తమన్ సంగీతం అందించడమే గాక, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చాడు.
Also Read:Kayadu Lohar : విజయ్ ఎంత మందిని బలితీసుకుంటావ్.. ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్
ఇక తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందే. పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ సీన్స్‌లో కానీ, ఫైట్ సీన్స్‌లో కానీ, సినిమా మొత్తం మీద సినిమాని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లడానికి తమన్ తన ప్రాణం పెట్టి చేశాడనిపించింది. అయితే, తాజాగా ఈ విషయం మీద రామ్ చరణ్ స్పందించారని తమన్ చెప్పుకొచ్చాడు. ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, నాకు ఓ జి సినిమా చూసిన తర్వాత రామ్ చరణ్ ఫోన్ చేశారు. “ఏ తమన్, ఏంటి ఆ ఫైర్ మోడ్? చేతికి కిరోజన్ రాసుకుని వాయించావా ఏంటి? అదిరిపోయింది,” అంటూ కామెంట్ చేశాడు. నేనే ఆశ్చర్యపోయి, “అన్నా, మీరు భలే పదాలు వాడుతూ ఉన్నారే,” అని అన్నాను అంటూ తమన్ చెప్పుకొచ్చాడు.