తెలుగు సినిమా పిచ్చోళ్లందరూ తమను ముద్దుగా పిలుచుకునే పేరు TFI బానిసలు. అలాంటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బానిసలందరికీ కళ్ళు జిగేల్ మనే ఒక ఫ్రేమ్ బయటకు వచ్చింది. అది ఎక్కడి నుంచి అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే, నిన్న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లందరూ ఒక చోట కలవాలని నిర్ణయం తీసుకుని కలిశారు. ఆ మీటింగ్ తర్వాత ఫోటోకి ఫోజు ఇవ్వగా, ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More: Sri Lanka: ఘోర ప్రమాదం.. కొండపై నుంచి బస్సు పడి 21 మంది మృతి..
ఈ ఫ్రేమ్‌లో ఇటీవల హిట్ త్రీ సినిమాతో సక్సెస్ అందుకున్న శైలేష్ కొలను, రామ్ చరణ్‌తో సినిమా చేస్తున్న బుచ్చిబాబు, బేబీ హిందీలో డైరెక్ట్ చేస్తున్న సాయి రాజేష్, అనుదీప్ కె.వి, శివ నిర్మాణ, పవన్ సాదినేని, రాహుల్ సంకృత్యాయన్, భరత్ కమ్మ, శ్రీరామ్ ఆదిత్య, చందు మొండేటి, సందీప్ రాజ్, హాసిత్ గోలి, వశిష్ట, వెంకీ కుడుముల, వివేక్ ఆత్రేయ, వినోద్ అనంతోజు, సాగర్ చంద్ర వంటి వారు ఉన్నారు. ఇక ఈ భేటీలో అందరూ కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. సరదాగా కుర్ర డైరెక్టర్లందరూ కలవాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.