తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు మంగళవారం నాడు గ్లోబల్ సమ్మిట్ లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి, విస్తరణకు సంబంధించి ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ నిర్మాతల్లో అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు సహా మెగాస్టార్ చిరంజీవి, నటులు జెనీలియా, అక్కినేని అమల…