టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర రీసౌండ్ వచ్చేలా దూసుకుపోతున్నాడు. హనుమాన్ సినిమాతో వచ్చిన సక్సెస్‌ను కంటిన్యూ చేస్తూ.. మిరాయ్ మూవీతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో విజువల్ వండర్‌గా తెరకెక్కిన మిరాయ్.. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయి మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 27.20 కోట్ల గ్రాస్ వసూలు చేసి.. హనుమాన్ తర్వాత తేజ సజ్జాకు భారీ ఓపెనింగ్స్ తెచ్చి పెట్టిన సినిమాగా నిలిచింది. ఇక రెండో రోజు మరింత ఎక్కువ వసూలు చేసి దుమ్ముదులిపేసింది. రెండు రోజుల్లో 55.66 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక మిరాయ్ మూడో రోజు లెక్క కూడా అదిరిపోయింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్‌లో 81.2 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి.. భారీ లాభాల దిశగా దూసుకుపోతోంది మిరాయ్.
Also Read : Pawan Kalyan : వకీల్ సాబ్ నుంచి ఓజీ వరకు..పవన్ స్పీడ్ చూసి మిగతా హీరోలు నేర్చుకోవాల్సిందే
అటు ఓవర్సీస్‌లోను 2 మిలియన్ మార్క్‌కు చేరువలో ఉంది. ఇక హిందీలో మాత్రం తేజ సజ్జా ఓ సంచలనం అనే చెప్పాలి. ఇప్పటి వరకు హిందీ మార్కెట్‌లో పాన్ ఇండియా హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ మాత్రమే సత్తా చాటుతున్నారు. కానీ ఇప్పుడు తేజ సజ్జా కూడా వీళ్ల సరసన చేరిపోయాడనే చెప్పాలి. హనుమాన్ సినిమాతో నార్త్ బెల్ట్‌లో మంచి ఫాలోయింగ్‌తో పాటు తనకంటూ సపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న తేజ.. మిరాయ్‌తో దాన్ని రెట్టింపు చేసుకున్నాడు. అందుకు నిదర్శనమే మిరాయ్ హిందీ వసూళ్లు. హిందీ బాక్సాఫీస్ దగ్గర మూడు రోజుల్లోనే 10 కోట్లు కలెక్ట్ చేసింది మిరాయ్. దీంతో.. తెలుగు నుండి ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి దిగ్గజాల తర్వాత ఈ స్థాయి విజయాన్ని సాధించిన ఏకైక హీరోగా తేజ సజ్జా నిలిచాడు. ఈ ఘనత అతని కెరీర్‌లో ఒక మైలురాయి మాత్రమే కాదు, పాన్ ఇండియా లెవల్లో నెక్స్ట్ బిగ్ థింగ్ అనే సామర్థ్యాన్ని సూచిస్తుంది. మొత్తంగా.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో పాన్ ఇండియా లెవల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ.