Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Tanikella Bharani Meets Pm Narendra Modi Viral Emotional Post

Modi : ‘రాముడు, కృష్ణుడిని చూడలేదు.. వారి అంశ ఉన్న మోడీని చూశా’ .. తనికెళ్ల భరణి ఎమోషనల్!

Published Date :May 11, 2026 , 3:09 pm
By Bhargav Chaganti
Modi : ‘రాముడు, కృష్ణుడిని చూడలేదు.. వారి అంశ ఉన్న మోడీని చూశా’ .. తనికెళ్ల భరణి ఎమోషనల్!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ప్రముఖ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రధానిని కలవడం పట్ల ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మోడీని సాక్షాత్తూ దైవాంశసంభూతుడిగా, మహనీయుల కలబోతగా అభివర్ణిస్తూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల తెలంగాణా పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిసిన తనికెళ్ల భరణి.. ఆయనతో ఆత్మీయంగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ సందర్భంగా తనదైన శైలిలో గొప్ప కవితాత్మక, భక్తి భావంతో కూడిన క్యాప్షన్‌ను జతచేశారు. “నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు.. ఇక మనం వారిని చూడలేము కూడా. కానీ, వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను. నా జన్మ ధన్యమైంది”* అని తన అభిమానాన్ని, చాటుకున్నారు.

Also Read

  • Kriti Sanon: మేమూ సమానంగా కష్టపడుతున్నాం.. హీరోలపై కృతి సనన్ ఫైర్!
  • Priyanka Chopra: విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన ప్రియాంక చోప్రా..
  • Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్‌లో త్రిష..
  • Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ
Add as a preferred
source on google

సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాలు, సాహిత్యం పట్ల ఎంతో మక్కువ చూపే తనికెళ్ల భరణి.. దేశ ప్రధానిని స్వయంగా కలవడం, ఆయనను దేవుళ్లతో సమానంగా భావిస్తూ ఉన్న ఫోటోను పంచుకోవడం రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆయన చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కొందరు ఆయన భక్తి భావాన్ని, మోడీపై ఉన్న గౌరవాన్ని మెచ్చుకుంటుండగా.. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cinema updates
  • emotional message
  • Narendra Modi
  • PM Narendra Modi
  • sanatana dharma

తాజావార్తలు

  • Modi : ‘రాముడు, కృష్ణుడిని చూడలేదు.. వారి అంశ ఉన్న మోడీని చూశా’ .. తనికెళ్ల భరణి ఎమోషనల్!

  • Trisha: అదే డ్రెస్, ఆ మాటే హింట్!.. విజయ్’తో లవ్ రూమర్స్’పై త్రిష రియాక్షన్!

  • Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!

  • Kriti Sanon: మేమూ సమానంగా కష్టపడుతున్నాం.. హీరోలపై కృతి సనన్ ఫైర్!

  • SRH vs GT: ప్లేఆఫ్స్ హీట్‌.. హై వోల్టేజ్ ఫైట్.. హైదరాబాద్, గుజరాత్‌కు కీలక సమరం!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions