లోకనాయుడుకు రీసెంట్గా విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తో.. ఎంజాయ్ చేస్తోన్న యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కు తమిళనాడు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కమల్ కు కోర్టు నోటీసులు పంపిందనే వార్తలు మీడియాల్లో బలంగా వినిపిస్తోంది. అసలు ఏం జరిగింది.. ఎందుకు అనే ప్రశ్నకు.. తమిళనాడు ప్రభుత్వం కమల్ హాసన్‌కు నోటీసులు పంపింది అనే విషయానికి వస్తే..చెన్నై లో రెండో దశ మెట్రో పనులు జరుగుతున్నాయి. అందులో ఆళ్వార్ పేటలోని కమల్ హాసన్ ఇంటి నుంచే మెట్రో వెళుతుంది. స్టేషన్ నిర్మాణం కోసం 170 చదరపు అడుగులు కావాలని, ఆ స్థలం కోసం తమిళనాడు ప్రభుత్వం కమల్ హాసన్‌కు నోటీసులు పంపింది. అయితే.. ఈ స్థలంలోనే కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ ఆఫీస్.. నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ ఆఫీసులు కూడా ఉన్నాయి. కాగా.. ఈ వ్యవహారంపై ఇటు కమల్ హాసన్.. అటు స్టాలిన్ ప్రభుత్వం నేరుగా స్పందించక పోవడం గమనార్హం.
read also: Satya Dev Birthday: వైవిధ్యంగా సాగుతున్న సత్యదేవ్
అయితే.. కమల్ హాసన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మెట్రో కోసం సదరు స్థలాన్ని ఇస్తారో లేదో చూడాలి. విక్రమ్ సినిమాల విషయానికి వస్తే కమల్ హాసన్, లోకేష్ కనరాజ్ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం విక్రమ్. గత నెలలో విడుదలైన ఈ చిత్రం సెన్సేషనల్ విజయాన్ని సాధించి.. రూ.400 కోట్ల మేరకు వసూళ్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి బ్లాక్ బస్టర్‌తో కమల్ హాసన్ ఫ్యాన్స్‌కు కాస్త ఊరట కలిగిందనే చెప్పాలి.
Airbus A380: ఏయిర్ బస్ విమానానికి తప్పిన ముప్పు.. 13 గంటల తర్వాత సేఫ్ ల్యాండింగ్