ప్రముఖ తమిళ దర్శకుడు సురేష్ సంగయ్య అనారోగ్య కారణాలతో మృతి చెందడం సినీ పరిశ్రమలో విషాదం నింపింది. తమిళ చిత్రసీమలో విభిన్నమైన కథలు తెరకెక్కించి అభిమానుల దృష్టిని ఆకర్షించిన దర్శకుల్లో సురేష్ సంగయ్య ఒకరు. 2017లో నటుడు విధార్థ్ హీరోగా ‘ఒరు కిటైన్ కరుణా మను’ చిత్రానికి దర్శకత్వం వహించి తన మొదటి సినిమాతోనే బెస్ట్ డైరెక్టర్ అని నిరూపించుకున్నారు. ఈ సినిమాలో డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా రవి హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ చిత్రంలో జార్జ్ మారియన్ సహా పలువురు ప్రముఖులు నటించారు. ఈ సినిమా విడుదలై అభిమానుల్లో మంచి స్పందనను అందుకోవడంతో పాటు పలు అవార్డులు అందుకుంది. ఈ సినిమా తర్వాత నటుడు ప్రేమ్ జి కథానాయకుడిగా సురేష్ సంగయ్య ‘సత్యాత్రిక’ చిత్రాన్ని రూపొందించారు.
Pushpa 2 The Rule: రేయ్ ఏంట్రా మీరు ఇలా ఉన్నారు.. గన్నులతో వెల్కమ్ ఏంటి?
విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం మంచి రివ్యూస్ అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం, సురేష్ సంగయ్య నటుడు యోగి బాబుతో ఇంకా పేరు పెట్టని సినిమాకి దర్శకత్వం వహించగా, నటుడు సెంథిల్‌తో ఒక సినిమాకి దర్శకత్వం వహించడం పూర్తి చేసినట్లు సమాచారం. అలాగే, గత నెల రోజులుగా జాండీస్‌తో బాధపడుతున్న సురేష్ సంగయ్య రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సురేష్ సంగయ్య కాలేయ సమస్యతో బాధపడుతూ నిన్న రాత్రి 10:20 గంటలకు మృతి చెందారు. ఇక ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన కోవిల్‌పట్టికి తీసుకెళ్లారు, అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలుస్తోంది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దర్శకుడు సురేష్ సంగయ్య ఆకస్మిక మృతితో సినీ ప్రముఖులు, అభిమానులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.