ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన స్టార్ హీరోయిన్ తమన్నా. ఎన్నో ఏళ్ల నుంచి కేవలం తెలుగులో మాత్రమే కాకుండా,ఇతర భాషలోను నటించి ఎన్నో విజయాలు అందుకొని దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన టాలెంట్ తో దూసుకుపోతోంది. ఎక్కువగా హిందీ సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు అక్కడ కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకుంది. బోల్డ్ సీన్స్ , ఐటమ్ సాంగ్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క పాత్రలో తన అభిమానులను అలరిస్తునే ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు ఎంచుకునే పాత్రల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది..
Also Read : Vincy : బెడ్ షేర్ చేసుకుంటేనే మూవీలో ఆఫర్‌లు.. అసలు నిజాలు బయటపెట్టిన నటి
‘ నేను ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేయాలని అనుకోవడం లేదు. అందంగా ఉన్నాను కాబట్టి నాకు అలాంటి పాత్రలు వస్తున్నాయి అని చాలామంది అంటున్నారు. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు వింతగా ఉంటుంది. మేము సినీ రంగంలో ఉంటున్నాం. ఈ పరిశ్రమలో ఉన్నవాళ్లకు అందం మీద శ్రద్ధ ఉండాలి. కానీ అలాగే ఎంచుకునే పాత్ర మీద కూడా శ్రద్ధ ఉండాలి. కథను ఎంచుకునేటప్పుడు పాత్ర గ్లామరస్‌గా ఉందా, లేదా అనేదానితో పాటు ఎన్నో విషయాలు చూసి ఎంపిక చేసుకోవాలి. మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ నాకు అభిమానులు ఇచ్చారు. క్రమంగా అది వాడుకలోకి వచ్చింది. మీడియా దాన్ని మరింత ప్రచారం చేసింది. కానీ ఈ ట్యాగ్ సినిమాల ఎంపికలపై ప్రభావం చూపలేదు’ అని చెప్పుకొచ్చింది తమన్నా.