సినిమా ఇండస్ట్రీలో ప్రతి తరం తన కొత్త ట్రెండ్‌లను సృష్టిస్తుంది. ఒకప్పుడు క్లాసిక్ పాత్రలు, ఫ్యామిలీ స్టోరీస్‌కు ప్రాధాన్యం ఉంటే.. నేడు హారర్, థ్రిల్లర్, బోల్డ్ కంటెంట్‌కీ ఎక్కువ డిమాండ్ ఉంది. అలాంటి ధైర్యవంతమైన కథలలో ‘రాగిణి MMS’ ఫ్రాంచైజీ ప్రత్యేక స్థానం సంపాదించింది. సన్నీ లియోన్ రెండవ భాగంలో చేసిన గ్లామరస్ అండ్ బోల్డ్ ప్రెజెన్స్ ఇప్పటికీ మర్చిపోలేని స్థాయిలో ఉంది. ఇప్పుడు అదే బాటలో మిల్కీ బ్యూటీ తమన్నా అడుగుపెట్టబోతోందని వినిపిస్తోంది.
Also Read : Anjali : యాక్షన్ స్టార్ విశాల్ నెక్స్ట్ మూవీలో అంజలి సర్‌ప్రైజ్!
ప్రజంట్ కాజల్, నయనతార, త్రిష వంటి సీనియర్ హీరోయిన్లు ఇప్పటికీ క్లాసీ పాత్రలతో బిజీగా ఉంటే.. తమన్నా మాత్రం తన కెరీర్ గ్రాఫ్‌కు కొత్త మలుపు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రత్యేక పాటలు, అల్ట్రా గ్లామరస్ పాత్రలు ఎంచుకుంటూ ఫ్యాన్స్‌కు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తోంది. ఇటీవల వచ్చిన “జైలర్” ఐటమ్ సాంగ్, “లస్ట్ స్టోరీస్ 2”లో ఆమె చేసిన బోల్డ్ రోల్ దీనికి నిదర్శనం. ఇప్పుడు హాట్ టాపిక్ ఏమిటంటే.. తమన్నా రాగిణి MMS 3లో హీరోయిన్‌గా వస్తుందట. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, తమన్నా ఈ ప్రాజెక్ట్ గురించి ఏక్తా కపూర్‌తో చర్చించిందట. ఇద్దరూ పాజిటివ్‌గా ఉన్నారని, డీల్ క్లోజ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నారని ఫిలిం నగర్‌లో టాక్ వినిపిస్తోంది. తమన్నా ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా కంఫర్ట్ జోన్లను బ్రేక్ చేసి, బోల్డ్ సీన్స్‌కు సిద్ధమవుతుందట.
‘రాగిణి MMS 2’లో సన్నీ చేసిన బోల్డ్ రోల్, బేబీ డాల్ సాంగ్ కలిగించిన హంగామా అందరికీ తెలిసిందే. అది ఒక బెంచ్‌మార్క్. ఇప్పుడు, తమన్నా ఆ లెవెల్‌ను రీచ్ అవుతుందా? లేక మించి హాట్ కాంపిటీషన్ ఇస్తుందా? అన్నది పెద్ద ప్రశ్న. తమన్నా గ్లామర్, నటనకు ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్ దృష్ట్యా.. ఈ ప్రాజెక్ట్ మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ రెండింటినీ ఆకర్షించే ఛాన్స్ ఉంది.