గత యేడాది ఫిబ్రవరిలో తాప్సీ పన్ను నటించిన తప్పడ్
మూవీ థియేటర్లలో విడుదలైంది. ఇన్ స్టెంట్ గా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆ సినిమాను మే నెలలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. తాజాగా తాప్సీ నటించిన మరో ఆసక్తికరమైన సినిమా నెట్ ఫ్లిక్స్ లో రాబోతోంది. తాప్సీ, హర్షవర్థన్ రాణే, విక్రాంత్ మెస్సీ ప్రధానపాత్రలు పోషించిన మూవీ హసీన్ దిల్ రుబా
. సినిమా ప్రారంభమై కావడంతోనే యువత దృష్టి ఈ మూవీ మీద పడింది. రొటీన్ కు భిన్నంగా ఉండబోతోందని స్టార్ కాస్ట్ బట్టి మూవీ లవర్స్ భావిస్తున్నారు. జులై 2న నెట్ ఫ్లిక్స్ లో దీనిని స్ట్రీమింగ్ చేస్తున్నామని తెలియచేస్తూ చిత్ర బృందం ఓ నయా పోస్టర్ ను సోమవారం విడుదల చేసింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీని వినిల్ మాథ్యూ దర్శకత్వంలో ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించారు.