తమిళనాడుకు చెందిన సూర్యకు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్యనే తెలుగు నిర్మాతతో, తెలుగు దర్శకుడితో తెలుగు సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. అలాగే, మరిన్ని తెలుగు సినిమాలు కూడా చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే, ఈ మధ్యకాలంలో ఆయన ఎన్నో కథలు విని చివరికి వెంకీ అట్లూరితో సినిమా
ఫైనల్ చేశారు. ప్రస్తుతానికి సినిమా షూటింగ్‌లో ఉంది, వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
Also Read :SS Rajamouli : దేవుడిపై రాజమౌళి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు
అయితే, ఆయన మరో తెలుగు దర్శకుడితో కూడా సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి, సరిపోదా శనివారం లాంటి విలక్షణమైన సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన వివేక్ ఆత్రేయ, సూర్యకు ఒక కథ చెప్పగా, అది ఆయనకు నచ్చిందని, పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని వచ్చి కలవమని చెప్పినట్లుగా తెలుస్తోంది.
Also Read :
ఈ సినిమా ఒక పూర్తి స్థాయి యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. ఫైనల్ నరేషన్ పూర్తయ్యాక సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు బయటకు తెలిసే అవకాశం ఉంది. సూర్య హీరోగా నటిస్తున్న కరుప్పు జనవరి 2026 లో రిలీజ్‌కి రెడీ అవుతోంది. అది పూర్తయిన వెంటనే, ఆవేశం దర్శకుడు జిత్తు మాధవన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కూడా ప్రారంభం కానుంది. మరోపక్క వెంకీ అట్లూరి సినిమా కూడా ప్యారలల్‌గా షూట్ చేయబోతున్నారు.
### English URL
/suriya-green-signal-vivek-athreya-another-telugu-film-venky-atluri-update
### SEO Meta Title
### SEO Meta Description
### SEO Meta Keywords