Supriya Statement against Konda Surekha Comments: నాగార్జున పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. నాగార్జున పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది. అంతకు ముందు నాగార్జున మేనకోడలు సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది కోర్ట్.. మొదటి సాక్షిగా సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన కోర్ట్, పిటిషన్ దారుడిగా నాగార్జున స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నది. ఆ తరువాత స్టేట్మెంట్ తీసుకున్న అనంతరం నాగార్జున సంతకం కూడా తీసుకుంది స్పెషల్ కోర్ట్. అక్టోబర్ 10న రెండో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ రికార్డు చేస్తామని తెలిపిన కోర్టు, నాగార్జున పిటిషన్ పై విచారణ 10వ తేదీకి వాయిదా వేసింది.
Odela 2: ఫైనల్ షెడ్యూల్ షూటింగ్లో తమన్నా ఓదెల 2
ఇక సుప్రియ స్టేట్మెంట్ లోని అంశాలు పరిశీలిస్తే మంత్రి చేసిన వాఖ్యలు వల్ల నాకు చాలా మంది నుండి ఫోన్ కాల్స్ వచ్చాయని ఆమె పేర్కొంది. మంత్రి చేసిన వ్యాఖ్యలను జడ్జి ముందు చదివి వినిపించిన సుప్రియ,మంత్రి చేసిన వ్యాఖ్యల వల్ల మా కుటుంబంలో మనశ్శాంతి లేకుండా పోయిందని పేర్కొంది. వైజాగ్ నుండి హైదరాబాద్ కు తిరిగి వచ్చిన తర్వాత వెళ్లి నాగార్జునను కలిశానని ఆమె పెక్రోన్నారు. మంత్రి వ్యాఖ్యలపై కుటుంబమంతా కలిసి చర్చించామని, మంత్రి చేసిన వ్యాఖ్యలను సినిమా పరిశ్రమ మొత్తం ఖండించిందని ఆమె అన్నారు. రాజకీయ నాయకులు సినిమా పరిశ్రమ టార్గెట్ గా చేసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆమె అభిప్రాయపడ్డారు.