టాలీవుడ్ టాలెంటెడ్ హీరో హీరో నితిన్ ఒక దశలో కమిట్ అయిన ‘పవర్ పేట’ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. ప్రారంభంలో ఈ సినిమాను కృష్ణ చైతన్య డైరెక్ట్ చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించాల్సి ఉండగా, అనుకోని కారణాలతో అప్పుడు నిలిపివేశారు. అయితే ఆ తర్వాత కృష్ణ చైతన్య విశ్వక్ సేన్‌తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ తెరకెక్కించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు అదే దర్శకుడు ‘పవర్ పేట’ స్క్రిప్ట్‌ను కొన్ని మార్పులు చేసి, మరోసారి రీ-లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి కథానాయకుడిగా సందీప్ కిషన్ ఎంపిక అయ్యారని సమాచారం.
Also Read : Kalpika : వివాదాస్పద నటి కల్పిక మరోసారి వార్తల్లోకి.. ఈసారి ఎందుకంటే?
ఈ కొత్త వెర్షన్‌కు సంబంధించిన ప్రొడక్షన్ బాధ్యతలు 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ తీసుకుంటున్నారని సమాచారం. భారీ స్థాయిలో ఈ సినిమాను ఆగస్టు 9న గ్రాండ్ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ఇక ‘పవర్ పేట’ ఎలాంటి స్టోరీతో రాబోతుంది? గతంలో నితిన్‌కి ప్లాన్ చేసిన పాత్రలో ఎలాంటి మార్పులు జరిగాయన్నది ఆసక్తికర అంశం. సందీప్ కిషన్ ఎలాగే మాస్ అప్పీల్ ఉన్న కథల్లో తళుక్కుమంటాడు కాబట్టి, ఈ సినిమా కూడా అతనికి మరో బ్రేక్ కావచ్చు.