Kalpika : మరో వివాదంలో నటి కల్పిక.. రిసార్ట్‌లో హంగామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సినీ నటి కల్పిక మరోసారి వివాదం సృష్టించింది. ఈసారి హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ – కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో ఆమె చేసిన హంగామా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..
మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్యాబ్‌లో ఒంటరిగా రిసార్ట్‌కు వచ్చిన కల్పిక, రిసెప్షన్‌లో అడుగు పెట్టగానే మేనేజర్ కృష్ణపై దురుసుగా ప్రవర్తించింది. ఆమె ప్రవర్తన రిసార్ట్ సిబ్బందిని పూర్తిగా అయోమయంలోకి నెట్టింది. ఒక్కసారిగా మెనూ కార్డును విసిరేయడం, రూమ్ కీస్‌ను మేనేజర్ ముఖంపై విసరడం, అలాగే అసభ్యంగా బూతులు మాట్లాడటం వంటివి కల్పిక చేయడంతో.. సిబ్బంది ఆశ్చర్యంగా, అసహ్యంగా చూసారు. అంతే కాకుండా, సిగరెట్లు కావాలంటూ పని చేస్తున్న సిబ్బందిపై కూడా దుర్బాషలాడినట్లు తెలిసింది. మొత్తం 40 నిమిషాల పాటు రిసార్ట్ ప్రాంగణంలో నానా నాటకాలు, వేధింపులతో న్యూసెన్స్ సృష్టించింది కల్పిక.దీని కారణంగా, ఇతర అతిథులు కూడా అసౌకర్యానికి గురయ్యారని సిబ్బంది చెబుతున్నారు. ఆమె ప్రవర్తన చూస్తుంటే ఏదైనా మానసిక ఒత్తిడి లేదా ఇతర సమస్యలు ఉన్నాయేమో అన్న అనుమానాలు సిబ్బందిలో వ్యక్తమయ్యాయి. అయితే..
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
దీని గురించి కల్పిక తాజాగా స్పందించారు.. తనపై వస్తున్న ఆరోపణలపై ఆమె స్పష్టత ఇచ్చారు ‘రిసార్ట్‌లోని సిబ్బంది అనవసరంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు. నేను హంగామా చేయలేదు. వారు నా పట్ల దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా క్యాబ్ సదుపాయం లేదు, వైఫై పనిచేయడం లేదు, సిగరెట్ తీసుకురమ్మన్నా తీసుకురాలేదు. ఎన్నిసార్లు చెప్పినా సిబ్బంది స్పందించలేదు. నా అవసరాలపై కనీస గౌరవం చూపకపోవడంతోనే బాధతో కొందరిని బూతులు తిటాల్సి వచ్చింది. అది తప్పుడు అర్థం చేసుకోవడం వలనే ఈ వివాదం పెద్దదైంది. నన్ను పోలీసులు ఒక వేరే కేసు విషయంలో వేధిస్తున్నారని, నేను ఓదార్పు కోసం రిసార్ట్‌కి వెళ్లాను. అక్కడైనా మనశాంతిగా ఉండాలని అనుకున్నా.. కానీ అక్కడ కూడా సమస్యలు మొదలయ్యాయి. అసలు నేను ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో అక్కడికి వెళ్లలేదు” అని ఆమె చెప్పింది. ఈ వ్యాఖ్యలతో కల్పిక తనపై వచ్చిన విమర్శలకు బదులిచ్చినట్టే కానీ, రిసార్ట్ సిబ్బంది ఇంకా అధికారికంగా స్పందించలేదు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!