Sundaram Master Postponed: వైవా అనే ఒక షార్ట్ వెబ్ సిరీస్ తో ఒక్కసారిగా సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ అందుకున్నాడు హర్ష. ఇక ఆ దెబ్బతో వైవా హర్షగా పేరు మార్చుకొని సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంటూ వస్తున్నాడు. ఇప్పటివరకు ఎక్కువగా కమెడియన్ తరహా పాత్రలు పోషిస్తూ వచ్చిన ఆయన ప్రధాన పాత్రలో ఒక సినిమా చేస్తున్నాడు. సుందరం మాస్టర్ పేరుతో ఒక కామెడీ ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కింది. ఇందులో వైవా హర్ష హీరోగా నటించాడు. ఇక ఈ సినిమాలో దివ్య శ్రీపాద, శాలిని నంబూ, శ్వేత వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రవితేజ నిర్మించడం గమనార్హం. టీజర్ తో ఒక్కసారిగా ఈ సినిమా మీద ఆసక్తి పెరిగిపోయింది.
Telugu Films This Week: ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు.. మీరు దేనికి వెళ్ళేది?
ముందు నుంచి రకరకాల ప్రచారాలు జరిగాయి కానీ కథ ఏమిటి అనే విషయం మీద టీజర్ కొంతవరకు క్లారిటీ ఇచ్చేసింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ని సినిమా యూనిట్ కొన్నాళ్ల క్రితమే అధికారికంగా ప్రకటించేసింది. అయితే ఇప్పుడు దాన్ని వాయిదా వేస్తూ ఈ సినిమాని ఫిబ్రవరి 23వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఒక పోస్టర్ కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 23వ తేదీన సుందరం మాస్టర్ వచ్చేస్తున్నాడు అంటూ పేర్కొన్నారు.. నిజానికి ఈ సినిమాని 16వ తేదీ రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఆరోజు ఆపరేషన్ వాలెంటైన్, ఊరు పేరు భైరవకోన సినిమాలు రిలీజ్ కి ఉండడంతో 23వ తేదీకి సినిమాని షిఫ్ట్ చేశారు. ఆ రోజు రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న తిరగబడరా స్వామి అనే ఒక సినిమా మాత్రమే ప్రస్తుతానికి స్లాట్ బుక్ చేసుకుంది. రెండు సినిమాలతో పోటీ పడడం కంటే ఒక సినిమాతో పోటీ పడడం పెట్టాలని వెనక్కి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతుంది.