తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా రూపొందిన సినిమా ‘ఇష్క్’. అయితే, గత నెలలో విడుదల కావాల్సిన ఈ లవ్ స్టోరీ కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడుతూ వస్తోంది.
ఇక ఈ మధ్య ‘ఇష్క్’ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ గురించి కొన్ని రూమర్స్ కూడా వినపడుతున్నాయి.
మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందిన ‘ఇష్క్’ శాటిలైట్ హక్కులు సన్ నెట్ వర్క్ సంస్థ పొందిన విషయం తెలిసిందే. అయితే, ఫ్యాన్సీ రేట్ ఆఫర్ చేసి రైట్స్ స్వంతం చేసుకున్న సన్ నెట్ వర్క్ ‘ఇష్క్’ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి ఒప్పుకోవటం లేదుట.
ఇంతకు ముందు సన్ సంస్థ రామ్ నటించిన ‘రెడ్’ మూవీ విడుదల విషయంలోనూ అభ్యంతరాలు తెలిపింది. ‘రెడ్’ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి సన్ ఒప్పుకోలేదు. ఇప్పుడు అదే పరిస్థితి ‘ఇష్క్’కి రావటంతో ఫిల్మ్ మేకర్స్ ఇతర దారుల్ని అన్వేషిస్తున్నారని సమాచారం!
ఇక ‘ఇష్క్’లో హీరోగా నటించిన తేజ సజ్జ మరో భారీ సినిమాకు సైన్ చేసినట్టు కూడా ఫిల్మ్ నగర్ టాక్. కానీ, ఇంకా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. త్వరలోనే తెలిసే ఛాన్స్ ఉందట!