సుధీర్ బాబు హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘జటాధర’. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో తేరకెక్కుతున్న ఈ సినిమా లో సుధీర్ బాబుతోపాటు బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్, రవి ప్రకాష్, ఇంద్ర కృష్ణ, నవీన్ నేని, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ నటిస్తున్నారు. జటాధర చిత్రాన్ని ప్రేరణ అరోరా, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్ నిర్మిస్తుండగా.. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేయగా. ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ‘జటాధర’ మూవీకి సంబంధించిన టీజర్ ను ఆగస్టు 8న విడుదల చేయబోతున్నట్లు అధికారంకంగా ప్రకటించారు . అలాగే ఓ పవర్ ఫుల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ప్రజంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుండడంతో సుధీర్ బాబు అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Brace yourself for a tale dipped in mystery, fire & power🔱#Jatadhara teaser on 8th August!!#UmeshKrBansal #PrernaArora @ZeeStudios_ @zeestudiossouth @sonakshisinha @shivin7 #ArunaAgarwal #ShilpaSinghal @DeshmukhPragati @girishjohar @kejriwalakshay @IamDivyaVijay… pic.twitter.com/6o5pMDkOvM
— Sudheer Babu (@isudheerbabu) August 4, 2025