శింబు హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రి మారన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. STR49 గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. వెట్రి మారన్ డిరెక్టన్ లో వచ్చిన వాడ చెన్నయ్ కు శింబుతో చేస్తున్న సినిమా సీక్వెల్ అని వార్తలు రాగ అలాంటిది ఏమి లేదని శింబు సినిమాను సరికొత్త కథానేపథ్యంలో రాసుకున్నానని క్లారిటీ ఇచ్చేసాడు వెట్రి మారన్.
Also Read : LokahChapter1 : ‘లోక’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
కాగా STR49 టైటిల్ ని కొద్దీ సేపటి క్రితం రిలీజ్ చేసారు మేకర్స్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు ‘ అరసన్’ అనే టైటిల్ ను అఫీషియల్ గా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు. అరసన్ అనగా కింగ్ అని అర్ధం. శింబు సినిమాకు ఇది పర్ఫెక్ట్ టైటిల్ అని చెప్పొచ్చు. కానీ ఈ పోస్టర్ ఇప్పుడు తమిళ సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. పోస్టర్ లో శింబు పట్టుకున్న కత్తి ‘వాడ చెన్నయ్’ లో ధనుష్ వాడిన కత్తిని పోలిఉండడం చర్చనీయాంశం అయింది. వెట్రిమారన్ వాడ చెన్నయ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే అరసన్ ను తెరకెక్కిస్తున్నడని చేస్తున్నారు ఫ్యాన్స్. ఏదేమైనా ఈ సినిమాతో శింబు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అరసన్ టైటిల్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకు తమిళ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తుండగా వి క్రియేషన్స్ పై కలైపులి యస్ థాను నిర్మిస్తున్నారు.