Site icon NTV Telugu

Priyanka Mohan: నెట్టింట ప్రియాంకా మోహన్ హాట్ ఫోటోస్.. ఘాటు రియాక్షన్!

Priya

Priya

Priyanka Mohan: పవన్ కళ్యాణ్ సరసన నటించిన ప్రియాంకా మోహన్ ఓజీ సినిమా విజయంతో ఆనందంగా ఉన్నారు. ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. దీంతో ఈ అమ్మడుకు యువతలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఓజీ విజయంతో ప్రస్తుతం ఆమె పలువురు స్టార్ హీరోలతో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. అయితే, ప్రియాంకా మోహన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె చాలా సెక్సీగా, యువతను రెచ్చగొట్టేలా తన అందాలను చూపిస్తున్నట్లు ఆ ఫోటోలు ఉన్నాయి. ఇక, వీటిని తెగ షేర్ చేస్తున్న యువతపై ప్రియాంకా మోహన్ తీవ్రంగా మండిపడింది.

Read Also: Prabhas Fauji Release Date: అదిరిపోయే అప్‌డేట్.. ప్రభాస్ మరో సినిమా రిలీజ్ డేట్ లాక్?

ఈ సందర్భంగా ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా స్పందించిన ప్రియాంకా మోహన్.. నన్ను తప్పుగా చిత్రీకరించేందుకు కొన్ని AI-జనరేటెడ్ ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. దయచేసి ఇలాంటి నకిలీ దృశ్యాలను షేర్ చేయడం ఆపండి అని కోరింది. ఏఐని నైతిక సృజనాత్మకత కోసం ఉపయోగించాలి.. కానీ, తప్పుడు సమాచారం కోసం కాదు అని సూచించింది. మనం ఏమి సృష్టిస్తామో, ఏమి పంచుకుంటాము అనే దాని గురించి జాగ్రత్తగా ఉండండి అంటూ ప్రియాంకా మోహన్ రాసుకొచ్చింది.

Exit mobile version