కోలీవుడ్ లో టీనేజ్ అండ్ 20 ఏజ్ గ్రూప్ హీరోలు తగ్గిపోయారు. అంతా 30ప్లస్, 40 ప్లస్ బ్యాచే. దీంతో రొమాంటిక్ అండ్ లవ్ చిత్రాలు పెద్దగా రావడం లేదు. సీనియర్లు అంతా ఉగ్రవాదం, దేశభక్తి, స్మగ్లింగ్, గ్యాంగ్ స్టర్ అంటూ సినిమాలు చేస్తున్నారు. మరి యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎవరు తీయాలి. అందుకే చాలా మంది స్టార్ వారసులపై హోప్స్ పెట్టుకున్నారు. విజయ్, ధనుష్, సూర్య, విజయ్ సేతుపతి, అజిత్ ఇలా వారసుల ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు.
Also Read : Abhi : తొలి సినిమానే డిఫరెంట్ కాన్సెప్ట్.. యంగ్ డైరెక్టర్ సాహసం
తమిళ ఇండస్ట్రీలో కొత్త హీరోలు రాబోతున్నారని సినీ ప్రేమికులు ఆశిస్తుంటే మేం కెమెరా ముందుకు రాలేం కెమెరా బ్యాక్ ఉంటామంటున్నారు. ఇప్పటికే ఇళయదళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకుడిగా మారి సందీప్ కిషన్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. జాసన్ బాటలోనే నడుస్తున్నాడు ధనుష్ పెద్ద కొడుకు యాత్ర.పెద్ద కొడుకు యాత్రను హీరోను చేయాలంటే ధనుష్ కు పెద్ద మ్యాటరే కాదు. కానీ ఈ స్టార్ సన్ కొడుక్కి హీరో కన్నా డైరెక్టర్ అవ్వాలన్నది కల. ఆ దిశగా ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు టాక్. వీరినే ఫాలో అయిపోతున్నాడు స్టార్ డైరెక్టర్ శంకర్ కొడుకు ఆర్జిత్ కూడా హీరో మెటీరియల్ కావాలనుకోవడం లేదు. ఎప్పటి నుండో అతడ్ని నటుడిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ వద్దని కెమెరా పట్టుకుంటున్నాడు. ఏఆర్ మురుగుదాస్ మదరాసికి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. వీరిలో విజయ్ సేతుపతి కొడుకు సూర్య మాత్రమే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక అజిత్ కొడుకు చిన్నోడు కావడంతో ఇప్పుడు ఏం డిసైడ్ చేయలేని పరిస్థితి. మరి సూర్య కొడుకు దేవా ఎటు వెళతాడో తెలియాలి. మరీ స్టార్ కిడ్స్ దర్శకులుగా ఉండిపోతారా రానున్న రోజుల్లోహీరోలుగా ఎంట్రీ ఇస్తారో లేదో.