కేజీఎఫ్ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ దక్కించుకుంది హీరోయిన్ శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ తర్వాత తెలుగులో ఆమె హిట్ త్రీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయిన తర్వాత, ఇప్పుడు ‘తెలుసు కదా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. సిద్ధు జోన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె రాషీ కన్నాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమాను కోనా వెంకట్ సోదరి నీరజ కోనా డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో ఫ్యాషన్ డిజైనర్‌గా, సెలబ్రిటీ స్టైలిస్ట్‌గా వ్యవహరించిన ఆమె, ఈ సినిమాతో దర్శకురాలిగా మారుతున్నారు.
Also Read:Nayanthara : 22 ఏళ్ల సినీ జర్నీ.. ప్రతి షాట్ నా జీవితాన్ని మార్చింది
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో, ఈరోజు శ్రీనిధి మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె ప్రశాంత్ నీల్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఒక మీడియా ప్రతినిధి, “గతంలో ప్రశాంత్ నీల్ లాంటి రగ్గడ్ డైరెక్టర్‌తో పనిచేశారు, ఇప్పుడు ఒక లేడీ డైరెక్టర్‌తో క్లాసీ మూవీ చేశారు. మీకు ఎలా అనిపిస్తోంది?” అని అడిగితే, “ప్రశాంత్ నీల్ చేసేవి మాత్రమే రగ్గడ్ సినిమాలు. ఆయన Pookie.. చాలా క్యూట్. అలాగే నీరజ కోనా కూడా చాలా స్టైలిష్‌గా ఈ సినిమా పూర్తి చేశారు” అంటూ ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. నిజానికి, శ్రీనిధి కన్నడ అమ్మాయి కావడంతో ఆ పదానికి తెలుగులో వేరే అర్థం వస్తుందని బహుశా తెలియకపోవచ్చు.
