కేజీఎఫ్ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ దక్కించుకుంది హీరోయిన్ శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ తర్వాత తెలుగులో ఆమె హిట్ త్రీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయిన తర్వాత, ఇప్పుడు ‘తెలుసు కదా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. సిద్ధు జోన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె రాషీ కన్నాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమాను కోనా వెంకట్ సోదరి నీరజ కోనా డైరెక్ట్ చేస్తున్నారు.…