Sreeleela : శ్రీ లీల బ్యాడ్ టైం ఇంకా అయిపోలేదా?

Sree Leela

Sree Leela

శ్రీ లీలకు తెలుగులో ఛాన్సులు దక్కడం లేదు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తర్వాత మరో ఛాన్స్ రాలేదు. తెలుగు మేకర్స్ పక్కన పెట్టేసినా, తంబీలు ఆదుకున్నారు. తమిళంలో నటించిన ఫస్ట్ మూవీ ‘పరాశక్తి’ ఫ్లాప్ అయినా, ‘ఓం’లో ధనుష్ భార్యగా నటించే ఛాన్స్ అందుకుంది. రిలీజ్‌కి ముందు మంచి పర్ఫార్మెన్స్ రోల్ అంటూ ఊదరగొట్టింది. తీరా చూస్తే సినిమాలో ఏమాత్రం ఇంపార్టెన్స్ లేదు. ఇంతకాలం తెలుగులోనే ఐరన్ లెగ్ ముద్ర పడగా, తమిళంలో స్ట్రాటజీ కంటిన్యూ చేసింది. ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి డైరెక్షన్‌లో ‘ఓం’ రూపొందడంతో సినిమా ఓ రేంజ్‌లో ఉంటుందని తంబీలు ఎక్స్‌పెక్ట్ చేశారు. అయితే ఆ అంచనాలకు ఏమాత్రం రీచ్ కాకపోగా, తీవ్రంగా నిరాశపరిచింది. శ్రీలీల కెరీర్‌లో ‘పెళ్లి సందడి’, ‘ధమాకా’ వంటి రెండు హిట్స్ తప్ప ముచ్చటగా చెప్పుకోవడానికి మూడో హిట్ లేదు. కథ, క్యారెక్టర్ గురించి ఆలోచించకుండా ముందునుంచి సినిమాల మీద సినిమాలు చేసేసి ఐరన్ లెగ్ ముద్ర కొని తెచ్చుకుంది శ్రీలీల. ‘గుంటూరు కారం’, ‘ఆదికేశవ’, ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి డిజాస్టర్స్ తర్వాత శ్రీలీల తెలుగులో ఫేడ్ అవుట్ అయింది. ఈ ఫ్లాప్ పరంపరను తమిళంలోనూ కొనసాగిస్తోంది.

శ్రీలీల కెరీర్ ఒకవైపు దురదృష్టంలో నడుస్తున్నా, మరోవైపు అదృష్టం కూడా వరిస్తోంది. ఏ లాంగ్వేజ్‌లో ఏ సినిమా చేసినా ఫ్లాపే, సక్సెస్ చూసి చాలా కాలమైంది. తెలుగులో రెండేళ్ల నుంచి ఒక్క సినిమా సైన్ చేయకపోయినా, తమిళంలో మాత్రం వరుస ఆఫర్స్ అందుకుంటోంది. రజనీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల నటిస్తోంది. సినిమా ఓపెనింగ్ డే సిమ్రన్, రాశీ ఖన్నా కనిపించగా, ఆ తర్వాత నయనతార ఎంట్రీ ఇచ్చింది. సెట్స్‌లోకి శ్రీలీల అడుగు పెట్టిందంటూ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అశ్వత్ మారిముత్తు దర్శకుడు. ఇంతమంది హీరోయిన్స్‌లో శ్రీలీల రోల్‌కు చోటు దక్కుతుందా, లేదంటే ఇది కూడా నామ్ కే వాస్తేనేమో చూడాలి మరి. తెలుగువారు శ్రీలీలను పట్టించుకోకపోయినా, తమిళంలో బిజీ అవుతోంది. అజిత్ ‘డేర్ డెవిల్’ ఛాన్స్ కొట్టేసింది. సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి శ్రీలీల హాజరైంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి సూపర్ హిట్ తీసిన అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. ‘డేర్ డెవిల్’తో శాలిని డేర్ చేసి ప్రొడ్యూసర్‌గా సొంత బ్యానర్ ‘బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్తోంది. శ్రీలీల తెలుగు కెరీర్‌కు దాదాపుగా ఫుల్ స్టాప్ పడినట్టే. తమిళంలో ఛాన్సులు అందుకుంటున్నా, మరిన్ని ఆఫర్స్ రావాలంటే నెక్స్ట్ రిలీజ్ అయ్యే ‘ధర్మన్’ హిట్ కావాల్సిందే. లేదంటే ఐరన్ లెగ్ ముద్ర అక్కడ కూడా బలంగా పడుతుంది. ఇప్పటికే ‘పరాశక్తి’, ‘ఓం’ ఫ్లాప్స్ చూసిన శ్రీలీలకు ‘ధర్మన్’ హిట్ చాలా అవసరం.