టాలీవుడ్‌లో కొత్త కథానాయకుడిగా కిరీటి రెడ్డిను పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం ‘జూనియర్’. ఈ నెల జూలై 18న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. యాక్షన్, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ కలగలిపిన ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ రూపొందించారు. ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీ లీల కథానాయికగా నటించడంతో, సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. విడుదలైన ట్రైలర్లు, సాంగ్స్ సినిమాపై పాజిటివ్ బజ్‌ని పెంచాయి. అయితే, ఈ సినిమా కోసం శ్రీలీల తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Stunt Master : షూటింగ్ సమయంలో ప్రమాదం – స్టంట్ మాస్టర్ ఎస్.ఎమ్.రాజు మృతి
ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, శ్రీ లీల ‘జూనియర్’ కోసం ఏకంగా రూ.2.5 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం టాప్ హీరోయిన్‌ల సరసన పేరు వినిపిస్తున్న శ్రీలీలకు ఈ స్థాయి డిమాండ్ ఉండటం ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. పలు బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత ఆమెకు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఈ పారితోషికం స్పష్టంగా చెబుతోంది. ఇక ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్రలో జెనీలియా నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత తెలుగు తెరకు మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తున్న ఆమె క్యారెక్టర్‌కి ప్రత్యేకమైన వెయిటేజు ఉంటుందని సమాచారం. అలాగే దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ‘జూనియర్’ కిరీటి కోసం ఓ పర్‌ఫెక్ట్ లాంచ్ ప్యాడ్ అవుతుందా? శ్రీలీల భారీ రెమ్యూనరేషన్‌కు తగ్గ హిట్‌ను అందుకుంటుందా? అన్న దాన్ని ప్రేక్షకుల స్పందన నిర్ణయించనుంది. కానీ ప్రస్తుత బజ్‌ను బట్టి చూస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ తెచ్చేలా ఉంది.