కబీర్ సింగ్‌తో బాలీవుడ్ కల్ట్ హీరోగా మారిన షాహీద్ కపూర్ మరోసారి సౌతిండియన్ డైరెక్టర్‌నే నమ్ముకున్నాడా. మరోసారి పవర్ ఫుల్ పాత్రలో యంగ్ హీరో కనిపించబోతున్నాడా అంటే అవుననే సమాధానం వస్తుంది. షాహీద్‌ను బాయ్ నెక్ట్స్ డోర్ నుండి కమర్షియల్ హీరోగా ఛేంజ్ చేసింది కబీర్ సింగ్. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డిని హిందీలో రీమేక్ చేసి కల్ట్ హిట్టిచ్చాడు తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ బ్లాక్ బస్టర్ హిట్టుతో సౌత్ దర్శకులపై నమ్మకాన్ని పెంచుకున్నాడు…