మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఈ చిత్రం తరువాత చిరంజీవి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించబోయే మలయాళ హిట్ మూవీ “లూసిఫర్”కు సిద్ధం కానున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక బాబీ దర్శకత్వంలో చిరు మరో చిత్రం చేయనున్నారు. ప్రస్తుతం ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరందుకుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ పేరు విన్పిస్తోంది. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఇందులో చిరంజీవితో రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక ఎమోషన్ అండ్ యాక్షన్‌తో కూడిన ఆసక్తికరమైన కథతో రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు.