బాలీవుడ్‌లో సీక్వెల్ సినిమాలకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి ఓ క్రేజీ సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’. అజయ్ దేవ్ గన్ ప్రధాన పాత్రలో, విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, రవి కిషన్, సంజయ్ మిశ్రా, చంకీ పాండే, నీరూ బాజ్వా తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన లభించగా.. ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరచుకుంది. ఇక తాజా అప్‌డేట్ ఏమిటంటే ఈ చిత్రం విడుదల వాయిదా పడింది.
Also Read : MEGA 157 : లీక్‌లపై ‘మెగా 157’ టీమ్ నుండి స్ట్రాంగ్ వార్నింగ్ ..
అందరికీ తెలిసినట్టు, ఈ చిత్రాన్ని జూలై 25న థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర బృందం ప్రకటించినప్పటికీ, ఇప్పుడు దాన్ని ఆగస్టు 1కి పోస్ట్‌పోన్ చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు కొంత నిరాశ చెందినప్పటికీ, సినిమా మీద ఆసక్తి తగ్గలేదు. ఈ వాయిదా వెనుక ఎక్కువగా చెప్పుకునే కారణం – బాక్సాఫీస్ క్లాష్, మార్కెటింగ్ విస్తరణ, ఫైనల్ వర్క్‌ల డిలే అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక పెద్ద మొత్తంలో హాస్యం, కుటుంబ భావోద్వేగాలు, మాస్ యాక్షన్ మిక్స్ అయ్యేలా ఈ సినిమాను రూపొందిస్తున్న ఈ మూవీ లో గమనించదగిన విషయం ఏమిటంటే..‘సన్ ఆఫ్ సర్దార్ 2’ (2012) మొదటి భాగం మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అజయ్ దేవ్ గన్ – సన్నీ డియోల్ మధ్య వచ్చిన యాక్షన్ సీన్స్ అప్పట్లో హైలైట్ అయ్యాయి. ఇప్పుడు అదే ఫ్రాంచైజీకి కొనసాగింపుగా వస్తున్న ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ కూడా అంతకు మించి ఉంటుందట. దీంతో అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి.