MEGA 157 : లీక్‌లపై ‘మెగా 157’ టీమ్ నుండి స్ట్రాంగ్ వార్నింగ్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మెగా 157’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్డేట్లు ఏవీ బయటకు రాకపోయినా, అభిమానులలో మాత్రం ఉత్కంఠ ఏ మాత్రం తగ్గడం లేదు.
Also Read : Shah Rukh Khan : ‘కింగ్’ మూవీ కి బ్రేక్.. షూటింగ్‌లో షారుఖ్‌కు గాయాలు..?
Also Read
ఇప్పటివరకు షూటింగ్ వివరాలు బయటకు రాకుండా బాగా జాగ్రత్తలు తీసుకుంటున్న బృందానికి.. ఒక చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం కేరళలో జరుగుతున్న షెడ్యూల్‌లో చిరంజీవి – నయనతారపై కీలక సన్నివేశాలు, ఒక పాట చిత్రీకరిస్తుండగా, అందులో భాగంగా ఓ వీడియో లీక్ అయింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని గమనించిన చిత్రబృందం తాజాగా అధికారికంగా స్పందించింది.. అలాంటి లీక్‌లను పంచుకోవద్దని .. అభిమానులు మేకర్స్ నుండి వచ్చే అధికారిక అప్డేట్ కోసం ఓపికగా ఉండాలని, లీక్‌డ్ కంటెంట్‌ను షేర్ చేయకుండా సహకరించాలని బృందం విజ్ఞప్తి చేస్తోంది.
‘ఇలా సెట్స్ లోపల తీసిన ఫోటోలు, వీడియోలు బయటకు రావడం వల్ల సినిమా మీద నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. పైగా ఇది కేవలం లీక్ కాదు, కాపీరైట్ హక్కుల ఉల్లంఘన కూడా. ఇలా ఎవరు చేస్తే, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ సినిమా జాగ్రత్తగా, ప్రేమతో, ఎంతో కష్టపడి చేస్తున్నారు. అందుకే ఫ్యాన్స్‌కి, మీడియా వేదికలకి ఒకే అభ్యర్థన, మాకు తోడుగా ఉండండి. అధికారిక సమాచారం రాగానే మేమే మీతో పంచుకుంటాం. మనమంతా కలసి ఈ ప్రాజెక్ట్‌ను అందంగా, బాగుపడేలా చూసుకుందాం. ఎలాంటి లీక్‌లు లేకుండా మనం సమర్థంగా ముందుకు సాగుదాం. మీ ప్రేమ, సహకారం కోసం ధన్యవాదాలు’ అంటూ నోట్ విడుదల చేశారు. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.
An official note from team #MEGA157.
Team #ChiruAnil humbly request not to share or circulate any leaked photos or videos from the sets.
A strict legal action will be taken against anyone involved in recording or distributing unauthorized content.@Shine_Screens @GoldBoxEnt pic.twitter.com/WX2w5VbdCb
— Shine Screens (@Shine_Screens) July 19, 2025
తాజావార్తలు
-
Share Nani Tag: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!