Sobhita Dhulipala about Samantha and Naga Chaitanya: నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల గత కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నారని ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే నిన్న పొద్దుపోయాక వీరు ఆగస్టు 8వ తేదీన ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు అనే వార్తలు తెరమీదకు వచ్చాయి. ఉదయం 9 గంటల 42 నిమిషాలకు వీరి నిశ్చితార్థం జరిగిందంటూ నాగార్జున కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు పాత వీడియోలన్నీ తెరమీదకి వస్తున్నాయి. నాగార్జున శోభిత గురించి మాట్లాడిన వీడియోలు శోభిత నాగచైతన్య, సమంత గురించి మాట్లాడిన వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సమంతా నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత ఒక ఇంటర్వ్యూలో శోభితను వీరిద్దరి నుంచి ఏం నేర్చుకుంటారు అని ఒక ప్రశ్న ఎదురైంది.
Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’లో అనుపమ్ ఖేర్
దానికి శోభిత ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. సమంత గురించి అడిగితే ఆమె జర్నీ సూపర్ కూల్ అనిపిస్తుందని చెప్పుకొచ్చింది. ఆమె ఒక సినిమాను ప్రమోట్ చేసే విధానం, హెడ్ లైన్ చేసే విధానం సూపర్ కూల్ అని అన్నారు. ఇక నాగచైతన్య గురించి అడిగితే చాలా డిగ్నిఫైడ్ గా కూల్ గా ఉంటాడని నాకు అది బాగా నచ్చుతుందని ఆమె కామెంట్ చేసింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సమంత నాగచైతన్య, శోభిత, నాగార్జునకు సంబంధించిన వీడియోలు, నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీరి ఎంగేజ్మెంట్ వార్త గురించి మరికొన్ని రోజుల పాటు చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది.