Ramayana : బాక్సాఫీస్‌పై ‘రామాయణ’ దండయాత్ర.. 12 రోజుల్లో కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ రికార్డులు గల్లంతు!

Ramayana Part 1 Twitter Review

Ramayana Part 1 Twitter Review

భారతీయ సినీ చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా బాక్సాఫీస్ వద్ద రామాయణ న విశ్వరూపాన్ని చూపిస్తోంది. దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కించిన ఈ రామాయణ విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ, కేవలం 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1,437.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటివరకు తిరుగులేని రికార్డులుగా భావించిన పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ల ఆల్-టైమ్ వసూళ్లను కేవలం రెండు వారాల్లోపే తుడిచిపెట్టేసింది. రణబీర్ కపూర్, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద సరికొత్త మైలురాళ్లను నెలకొల్పుతూ భారతీయ సినిమా సత్తాను అంతర్జాతీయ స్థాయిలో చాటిచెబుతోంది. ‘రామాయణ’ ధాటికి కుప్పకూలిన భారీ చిత్రాల జాబితా చూస్తే ఈ సినిమా ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది:

బాక్సాఫీస్ వద్ద 1,307.35 కోట్ల లైఫ్‌టైమ్ కలెక్షన్లతో ఉన్న ‘ధురంధర్’ రికార్డును దాటేసి, భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాల జాబితాలో ‘రామాయణ’ సగర్వంగా అడుగుపెట్టింది. రాకింగ్ స్టార్ యశ్ గతంలో సృష్టించిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ (KGF 2) 1,215 కోట్ల వసూళ్లను ఈ సినిమా కేవలం 10 రోజుల్లోనే అధిగమించడం విశేషం. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (1,230 కోట్లు), ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ (1,042 కోట్లు) లాంటి భారీ చిత్రాల లైఫ్‌టైమ్ వసూళ్లు ‘రామాయణ’ వేగం ముందు నిలవలేకపోయాయి కేవలం మన దేశంలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లోనూ ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రముఖ జపనీస్ చిత్రం ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ ప్రపంచవ్యాప్తంగా సాధించిన 104.18 మిలియన్ డాలర్ల వసూళ్లను సైతం వెనక్కి నెట్టి బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రెండు వారాలు కూడా నిండకముందే 1400 కోట్ల మార్కును దాటేసిన ‘రామాయణ: పార్ట్ 1’, రాబోయే రోజుల్లో ఇంకెన్ని వేల కోట్ల రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుందోనని సినీ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.